JAILER 2 Official Trailer: రజనీకాంత్ 'జైలర్ 2' ట్రైలర్ రిలీజ్..
సూపర్ స్టార్ రజనీకాంత్- కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన జైలర్ మూవీ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిందే. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 600 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించి 2023 లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ ఇంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకోవడానికి కారణం నెల్సర్ దర్శకత్వంలోని మ్యాజిక్, రజనీకాంత్ మాస్ అండ్ స్టైల్ యాక్షన్, హీరో ఎలివేషన్లు, తమన్నా అందాలు, సునీల్, యోగిబాబు కామెడీ, విలన్ రోల్ ఆద్యంతం అభిమానుల్ని కట్టి పడేసింది. అంతేకాక ఈ మూవీలో శివ రాజ్ కుమార్ మాస్ ఎంట్రీ, మోహన్ లాల్ స్పెషల్ అట్రాక్షన్ అదరగొట్టాయి. అయితే ఈ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పట్లో నెల్సన్ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే.

ఈ మేరకు జైలర్ 2 షూటింగ్ కూడా అనుకున్న సమయానికే పూర్తి చేసుకుంది. దసరా కానుకగా అక్టోబర్ 15 న ప్రపంచవ్యాప్తంగా జైలర్ 2 మూవీ రిలీజ్ కానుంది. జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ కావడంతో జైలర్ 2 పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక జైలర్ మూవీ తొలి భాగం ఎక్కడైతే పూర్తయిందో అక్కడి నుంచే ఈ మూవీ సీక్వెల్ ప్రారంభం కానుంది. ఇందులో పలు ఇండస్ట్రీలకు చెందిన స్టార్ నటులు కనిపించనున్నారు. అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇక తాజాగా రిలీజ్ అయిన జైలర్ 2 ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. ట్రైలర్ చాలా ఇంటెన్స్ గా ఉంది. ఎస్ జే సూర్య, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, విద్య బాలన్ తదితరుల పాత్రలను పరిచయం చేస్తూ సాగిన ట్రైలర్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
ఇక జైలర్ 2 మూవీ రీలీజ్ కు ముందే పలు రికార్డుల్ని కొల్ల గొట్టింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడైనట్లు సినీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఏకంగా రూ.160 కోట్లకు దక్కించుకున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే తమిళ చిత్రసీమలో రజనీ సరికొత్త రికార్డును నెలకొల్పినట్టేనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.












Click it and Unblock the Notifications
