Hanuman Ansh Telugu Trailer: 'హనుమాన్ అంశ్' తెలుగు ట్రైలర్ రిలీజ్..
ఈ ఏడాది అత్యంత జనాదరణ పొందిన సినిమాల్లో 'హనుమాన్ అంశ్' ఒకటి. ఆగస్టు 7 సైలెంట్ గా హిందీలో రిలీజ్ అయిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్ సంచలన విజయాన్ని అందుకుంది. అలా ఒక్కో వారానికి వసూళ్లు పెరిగాయి. ఇటీవల థియేటర్లలో ఈ సినిమా 50 రోజుల థియేట్రికల్ రన్ ను విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఈ రోజుల్లో 50 డేస్ థియేట్రికల్ రన్నింగ్ ను కంప్లీట్ చేసుకోవడం అంటే మామూలు విషయం కాదనే చెప్పుకోవాలి. ఓవరాల్ గా ఇప్పటిదాకా హనుమాన్ అంశ్ చిత్రానికి రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్లు రావడం విశేషం.
హనుమాన్ అంశ్ చిత్రాన్ని కేవలం రూ. 2 కోట్లతోనే నిర్మించారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 400 కోట్లకు పైగా కలెక్షన్స్ తో 2000 శాతం లాభాలు వచ్చాయి. ఈ రేంజ్ లాభాలు మరే సినిమాకూ రాలేదనే చెప్పాలి. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అయింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఈ సినిమా తెలుగు వెర్షన్ ను రిలీజ్ చేస్తుంది. అక్టోబర్ 9 న ఈ మూవీ తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధం అవుతోంది. ఈ మేరకు కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ట్రైలర్ ను విడుదల చేసింది.
హనుమాన్ అంశ్ మూవీ తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. డబ్బింగ్ చాలా బాగా చేశారు. దాంతో ఈ మూవీని చూసేందుకు సినీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అటు ఈ మూవీ రిలీజ్ పై హోంబలే ఫిల్స్మ్ కీలక ప్రకటన చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీ ఆదరణ పొందిన ఈ సినిమాను తెలుగులోకి తీసుకురావడం సంతోషాన్నిచ్చిందని ఎక్స్ లో పోస్టు చేసింది. ఇక ఈ మూవీ ఆధ్యాత్మిక వేత్త నీమ్ బాబా కరోలి జీవితం ఆధారంగా తెరకెక్కింది.

హనుమాన్ అంశ్ చిత్రాన్ని దర్శకుడు విశాల్ చతుర్వేది అద్భుతంగా తెరకెక్కించారు. ఈ మూవీలో శోభినవ్ సత్య ప్రధాన పాత్రలో నటించారు. అలాగే చందన్ ఆనంద్, అనిల్ రస్తోగీ, పూర్ణిమ తివారి, భగవాన్ దాస్ పటేల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక స్వంభు మీడియా నెట్ వర్క్, హోలీ కౌ హోమ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై తెరకెక్కింది. రాగిణి సోనా, విశాల్ చతుర్వేది, అనుప్రియా నగర్, నమ్రతా జి సింగ్ నిర్మాతలుగా వ్యవహరించారు.












Click it and Unblock the Notifications
