Aadhaar Name Change Rules: ఇకపై ఆధార్ పేరు మార్పులు ఇలా-కొత్త రూల్స్..!

ఆధార్ కార్డుల్లో పేరు మార్చుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) సరికొత్త స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (SOP) విధానాన్ని అమల్లోకి తెచ్చింది. ఆధార్ నమోదు మరియు అప్‌డేట్ నిబంధనలు 2016 లోని నిబంధన 19 కింద ఈ మార్పులు చేశారు. ఆధార్ నమోదు సమయంలో లేదా ఆ తర్వాత ఎంతో మంది కార్డుదారులు ఎదుర్కొంటున్న పెళ్లి తర్వాత ఇంటి పేరు మార్చుకోవడం, చిన్నపాటి స్పెల్లింగ్ మిస్టేక్స్ వంటి సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. దీంతో ఇకపై ఆధార్ పేరు మార్పులో ఈ కొత్త నిబంధనలు (Aadhaar Name Change Rules) వర్తిస్తాయి.

ఆఫ్ లైన్ లోనే పేర్ల అప్డేట్ (Aadhaar Name Change )

ఈ అప్డేట్ ప్రక్రియను ఆన్‌లైన్‌లో కాకుండా పూర్తిగా ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే చేయాల్సి ఉంటుంది. దీని కోసం ఆధార్ కార్డుదారులు తమకు సమీపంలో ఉండే ఆధార్ సేవా కేంద్రాన్ని లేదా ఎన్‌రోల్‌మెంట్ కేంద్రాన్ని స్వయంగా సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ తగిన గుర్తింపు ధృవీకరణ పత్రాలను సమర్పించి, అవసరమైన చోట బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ను పూర్తి చేయాలి. ఈ డెమోగ్రాఫిక్ అప్‌డేట్ లేదా మార్పుల కోసం కేవలం 50 రూపాయల సేవా రుసుమును కేంద్రంలో చెల్లించాల్సి ఉంటుంది.

Aadhaar Name Change Rules
కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పై మరో గుడ్ న్యూస్- ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..!
కోటిపల్లి-నరసాపురం రైల్వే లైన్ పై మరో గుడ్ న్యూస్- ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..!

ఎలాంటి మార్పులకు అవకాశం ?

కొత్తగా విడుదలైన మార్గదర్శకాల ప్రకారం, పేరుతో పాటు ఉండే అక్షరాల సంక్షిప్త రూపాలను (ఇనిషియల్స్) పూర్తి పేరుగా మార్చుకోవచ్చు లేదా మరికొన్ని అక్షరాల రూపంలోకి మార్చవచ్చు. ఉదాహరణకు 'టి.ఆర్.డి. ప్రసాద్' అనే పేరును 'తాడి రామ దుర్గ ప్రసాద్'గా మార్చుకోవచ్చు. అలాగే పేరు క్రమాన్ని మార్చుకోవడం, మధ్య పేరును (మిడిల్ నేమ్) తొలగించడమో లేదా కొత్తగా జోడించడమో చేయవచ్చు. పూజ, సోమ్య వంటి సాధారణ స్పెల్లింగ్ తప్పులను కూడా సులభంగా సరిచేసుకోవచ్చు.

Aadhaar Name Change Rules
 ఏపీకి మరో భారీ ప్రాజెక్టు, కేంద్రం గ్రీన్ సిగ్నల్- రూ 1.50 లక్షల కోట్లతో..!!
ఏపీకి మరో భారీ ప్రాజెక్టు, కేంద్రం గ్రీన్ సిగ్నల్- రూ 1.50 లక్షల కోట్లతో..!!

గతంలో జరిగిన తప్పిదాలకూ..!

గతంలో ఆధార్ నమోదు ప్రకియలో పొరపాటున పేరుకు ముందు చేరిన డాక్టర్, ప్రొఫెసర్, మేజర్, లీగల్ లేదా శ్రీ, శ్రీమతి, మిస్టర్ వంటి గౌరవ సూచకాలను, సైనిక హోదాలను పేరు నుంచి తొలగించడానికి కూడా వీలుంటుంది. అలాగే పేరులో క్యాపిటల్ అక్షరాల వాడకం తప్పుగా పడినా, చుక్కలు (డాట్స్), అలాయస్ లేదా ఉర్ఫ్ వంటి ప్రత్యేక పదాల తొలగింపు కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంగ్లీషులో పేరు సరిగ్గా ఉండి స్థానిక ప్రాంతీయ భాషలో తప్పుగా పడినా సరిచేసుకోవచ్చు. ఈ రకమైన మార్పుల కోసం దరఖాస్తుదారులు పాన్‌కార్డు, పాస్‌పోర్టు, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా వివాహ ధృవీకరణ పత్రంలో ఏదైనా ఒక చెల్లుబాటయ్యే గుర్తింపు పత్రాన్ని ఖచ్చితంగా సమర్పించాలి. మైనర్ల పేర్లలో మార్పుల కోసం తల్లిదండ్రులతో గల బంధుత్వ ధృవీకరణ పత్రాలు అవసరమవుతాయి. దరఖాస్తు సమర్పించిన తర్వాత వచ్చే అప్డేట్ రిక్వెస్ట్ నంబర్ (URN) అక్‌నాలెడ్జ్‌మెంట్ స్లిప్ సాయంతో మార్పుల యొక్క స్థితిని ఆన్‌లైన్‌లో ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+