పవన్ వ్యూహాలతో జగన్ కు అధికారం ఖాయం - సీపీఐ నారాయణ..!!
సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఏపీ రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనీయకుండి పొత్తుల అంశం పైన పవన్ చేస్తున్న ప్రయత్నాలను నారాయణ తప్పు బట్టారు. పవన్ కోరుతున్నట్లుగా బీజేపీ, తెలుగుదేశం పార్టీ , జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే చివరకు వైసీపీకే లాభం చేకూరుతుందని తేల్చి చెప్పారు. బీజేపీ వ్యతిరేక ఓటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకీ పడుతుందని, మళ్లీ వైఎస్ జగనే విజయం సాధించే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.

ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఏకం అయితే అది ముఖ్యమంత్రి జగన్ కు లాభం చేస్తుందని నారాయణ విశ్లేషించారు. పవన్ కోరుకున్నట్లుగా పొత్తు కుదిరితే అది జగన్ నెత్తిన పాలు పోయటమేనని వ్యాఖ్యానించారు. బీజేపీ వ్యతిరేక ఓటు వైసీపీకి పడుతుందని..మళ్లీ జగన్ విజయం సాధిస్తారని వివరించారు. టీడీపీ, జనసేన వెళ్లి బీజేపీతో కలిస్తే వైసీపీకి లాభం జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ కూటమి వచ్చినా రాష్ట్రంలో ఎటువంటి లాభం ఉండదన్నారు. ఇదే సమయంలో కడప ఎంపీ అవినాశ్ విషయంలో సీబీఐ వ్యవహార శైలి పైన నారాయణ స్పందించారు. గవర్నర్ వ్యవస్థకు అనుకుంగా తెచ్చే ఆర్డినెన్సు కు రాజ్యసభలో మద్దతు కోసమే బిజెపి వివేకా కేసులో కేంద్రం సహకరిస్తోందని ఆరోపించారు.

అవినాష్ అరెస్టు లాంటి ఘటన తమిళనాడులో , కర్ణాటకలో, కేరళలో జరిగితే కేంద్ర బలగాలు దింపి అరెస్టులు చేసేవారని నారాయణ వ్యాఖ్యానించారు. ఈ రాష్ట్రంలో సీబీఐ ఉత్సవ విగ్రహాలు గా ఉన్నారని ధ్వజ మెత్తారు. వివేకా హత్య కేసులో ఆలస్యానికి లోపాయి కారి ఒప్పందాలు పని చేస్తున్నాయని పేర్కొన్నారు. వివేకా కుమార్తె డాక్టర్ సునీత చొరవ వల్లే ఈ కేసు ఇంత దాకైనా వచ్చిందని అభిప్రాయపడ్డారు. తెలుగు ప్రజలకు మొదటి శత్రువు బిజెపి, రెండో శత్రువు వైసిపి అని నారాయణ విమర్శించారు. రెండు వేల నో ట్ల ఉపసంహరణ కేవలం అధికార పక్షం నల్ల ధనాన్ని తెల్ల ధనం గా మార్చుకోవడానికేనని నారాయణ విశ్లేషించారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు డబ్బు అందుబాటులో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందన్నారు. లీగల్ గా మోడీ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నారుని నారాయణ ఆరోపించారు.












Click it and Unblock the Notifications