లగడపాటి దారిలో: రాజకీయాలకు దగ్గుబాటి గుడ్‌బై!

Daggubati may quit politics
హైదరాబాద్: విజయవాడ మాజీ పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్ దారిలోనే మాజీ కేంద్రమంత్రి దగ్గుబాటి పురంధేశ్వరి భర్త, పర్చూరు శాసన సభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర రావు నడువనున్నారు. తన రాజకీయ భవిష్యత్తు పైన దగ్గుబాటి కీలక నిర్ణయం తీసుకున్నారట. రాజకీయాల నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నారట. సీమాంధ్ర ప్రాంత అభివృద్ధిలో పాలు పంచుకోనున్నారు.

దగ్గుబాటి వెంకటేశ్వర రావు 2009 సాధారణ ఎన్నికల్లో పర్చూరు నియోజకవర్గం నుండి కాంగ్రెసు పార్టీ తరఫున పోటీ చేసి గెలిచారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 'నోటా'ను ఉపయోగించుకొని సంచలనం సృష్టించారు. తాజాగా రాజకీయాల నుండి తప్పుకునేందుకు సిద్ధపడ్డారు.

కాగా, దగ్గుబాటి పురంధేశ్వరి కాంగ్రెసు పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. గురువారం ఆమె విశాఖలో మాట్లాడారు. తాను ఎలాంటి షరతులు విధించకుండా భారతీయ జనతా పార్టీలో చేరుతున్నానని చెప్పారు. తాను ఎలాంటి షరతులు లేకుండా బిజెపిలో చేరుతానన్నారు. తాను రేపు ఢిల్లీకి వెళ్లి సుష్మా స్వరాజ్, అద్వానీ, అరుణ్ జైట్లీలను కలుస్తానని చెప్పారు.

పార్టీలో చేరుతున్నా తన నుండి వారిపై ఎలాంటి ఒత్తిళ్లు ఉండవన్నారు. తాను ఇప్పటి వరకు పలు పార్టీలతో మాట్లాడినట్లుగా ప్రచారం సాగిందని కానీ, అది అవాస్తవమన్నారు. ఇప్పటి వరకు తాను ఏ పార్టీలతో చర్చలు జరపలేదని, తన కార్యకర్తలను కలిసిన తర్వాతనే నిర్ణయం తీసుకున్నానని చెప్పారు. తనతో కలిసి రావాలని ఎవరి పైన తాను ఒత్తిడి చేయడం లేదని చెప్పారు. కాంగ్రెసు పార్టీని వీడటం బాధాకరమే అయినా తప్పడం లేదన్నారు. తాను ఏ పార్టీలో చేరినా విశాఖ నుండే పోటీ చేస్తానని ఆమె చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+