వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దటీజ్ దాసరి: అందుకోసం చిరంజీవితోనూ కలిశారు! ఎన్టీఆర్-బాబులపై ఫైట్

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు కాపులకు రిజర్వేషన్ల అంశంపై ఉద్యమిస్తున్న సమయంలో కన్నుమూశారు. ఇందుకోసం ఆయన మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి కూడా దగ్గరయ్యారని చెప్పవచ్చు.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ దర్శకులు దాసరి నారాయణ రావు కాపులకు రిజర్వేషన్ల అంశంపై ఉద్యమిస్తున్న సమయంలో కన్నుమూశారు. ఇందుకోసం ఆయన మాజీ కేంద్రమంత్రి చిరంజీవికి కూడా దగ్గరయ్యారని చెప్పవచ్చు.

<strong>దాసరి సినిమాల వల్లే ఎన్టీఆర్ సీఎంగా!, రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు</strong>దాసరి సినిమాల వల్లే ఎన్టీఆర్ సీఎంగా!, రాజకీయాలపై వ్యంగ్యాస్త్రాలు

సినిమాల్లో, రాజకీయాల్లో దాసరి నారాయణ రావు తన ప్రత్యేకత చాటుకున్నారు. ఏపీలో నడుస్తున్న కాపు ఉద్యమంలో దాసరి తనదైన పాత్ర పోషిస్తున్నారు.

ముద్రగడకు అండ

ముద్రగడకు అండ

కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపులను బిసిల్లో చేర్చాలని ఉద్యమిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి దాసరి మద్దతు పలికారు. భవిష్యత్ కార్యాచరణ కోసం అందరినీ ఒక్కతాటి పైకి తీసుకు వచ్చే బాధ్యతను కూడా దాసరి భుజాన వేసుకున్నారు.

చంద్రబాబుపై ఆగ్రహం

చంద్రబాబుపై ఆగ్రహం

కాపులకు రిజర్వేషన్లే సాధించేందుకు అన్ని పార్టీల నేతలను ఏకతాటిపైకి తీసుకు వచ్చారు. ముద్రగడను అరెస్టు చేసి రాజమండ్రి ఆసుపత్రికి తరలించి, కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సమయంలో దాసరి... చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడ్డారు.

కాపు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు, భవిష్యత్తు కార్యాచరణ రచించడం కోసం గత ఏడాది అక్టోబర్ 4న తన స్వగృహంలోనే కాపు నాయకులతో సమావేశం ఏర్పాటు చేశారు. చంద్రబాబు కాపులను బీసీల్లో చేర్చుతామని హామీ ఇచ్చినందున దానిపై ఫైట్ చేస్తున్నారు.

చిరంజీవితో విభేదాలు పక్కన పెట్టి..

చిరంజీవితో విభేదాలు పక్కన పెట్టి..

చిరంజీవితో దాసరికి విభేదాలు ఉన్నాయనే వాదనలు ఉన్నాయి. కానీ కాపు ఉద్యమం కోసం చిరంజీవితోను కలిశారని అంటారు. కాపులను బీసీల్లో చేర్చేందుకు అన్ని విభేదాలను పక్కన పెట్టి ముందుకు వెళ్లాలని దాసరి భావించారని అంటారు.

జగన్ వైపు అడుగేసినట్లుగా..

జగన్ వైపు అడుగేసినట్లుగా..

చిరంజీ తన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం, ఆ తర్వాత ఆయనకు రాజ్యసభ, కేంద్రమంత్రి పదవి ఇచ్చిన నేపథ్యంలో దాసరి కాంగ్రెస్ పార్టీకి దూరం జరిగినట్లుగా కనిపించింది. గత కొద్దికాలంగా దాసరి తీరు జగన్ వైపు అడుగులు వేసినట్లుగా కనిపించింది.

నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు

నాడు ఎన్టీఆర్.. నేడు చంద్రబాబు

స్వర్గీయ నందమూరి తారక రామారావు పార్టీ పెట్టి తొమ్మిది నెలల్లోనే సీఎం అయ్యారు. ఆయన సీఎం కావడానికి దాసరి తీసిన సినిమాలు ఎంతో ఉపయోగపడ్డాయి. అయినప్పటికీ అదే దాసరి నాడు ఎన్టీఆర్‌ను, ఇప్పుడు చంద్రబాబును ఢీకొట్టే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీకి, ఇతర నేతలకు కనిపించారని చెప్పవచ్చు.

English summary
Dasari Narayana Rao works with Congress leader Chiranjeevi for Kapu reservations.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X