జనాభా పెంచుకోలేకే జపాన్ వెనక్కి, మనం..: బాబు

హైదరాబాద్: నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం సాయం సాధిస్తామని, నిధులు లేక అభివృద్ధిని కట్టడి చేశామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీకి పరిస్థితిని వివరించానని చెప్పారు. ఆయన సానుకూలంగానే ఉన్నారని చంద్రబాబు తెలిపారు. కొత్తగా పుట్టిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి తన విదేశీ పర్యటనల ద్వారా అంతర్జాతీయ గుర్తింపు, బ్రాండింగ్‌ తేగలిగానని చంద్రబాబు అన్నారు.

కొత్త రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలని, అవి రావడానికి బలమైన మార్కెటింగ్‌ ఉండాలని, తానుగతంలో హైదరాబాద్‌కు పెట్టుబడులు, కంపెనీలు రావడానికి అటువంటి మార్కెటింగ్‌ చేశానని, ఇప్పుడు అదే పనిని ఏపీ కోసం చేస్తున్నానని చెప్పారు. తన ప్రతి పర్యటనకూ ఒక కొలబద్ద పెట్టి ఫలితాలు ఏం వచ్చాయని చూడటం సరికాదని, సానుకూల వాతావరణాన్ని ఏర్పరిస్తే ఫలితాలు అవే వస్తాయన్నారు.

తాను గతంలో హైదరాబాద్‌కు కంపెనీలను తీసుకురావడం కోసం పలు దేశాలు తిరిగినప్పుడు కూడా ఏం వచ్చాయని ప్రతిసారీ ఇలాగే అడిగేవారని, అప్పట్లో అమెరికాలో 14 రోజులుండి గడపగడపకూ తిరిగానని, బిల్‌గేట్స్‌ వద్దకు వెళ్లి ఒప్పించి మైక్రోసాఫ్ట్‌ కంపెనీని హైదరాబాద్‌కు తెచ్చానని, ఆ తర్వాత కంపెనీలన్నీ వరస కట్టాయని, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం కోసం కూడా ఇలాగే తిరుగుతున్నానని తెలిపారు.

దావోస్‌కు తాను వచ్చానని తెలిసి మైక్రోసాఫ్ట్‌ కంపెనీ అధినేత బిల్‌గేట్స్‌ తనను కలవడానికి ఆత్రుత చూపించారని, ఆయనను కలవడానికి ఎంతోమంది ఎదురు చూస్తున్నా నలభై ఐదు నిమషాలు తనతో గడిపారని, ప్రపంచవ్యాప్తంగా అందరికీ మంచి ఆరోగ్యం అందించాలని, ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి సదుపాయం ఉండాలని, ప్రతి కుటుంబానికి ఆర్థికస్వాతంత్య్రం ఉండాలని తదితర అంశాలపై ఆయన పని చేస్తున్నారన్నారు. ఏపీలోను అమలు చేయమన్నానన్నారు.

చంద్రబాబు

చంద్రబాబు

శ్రీశైలం అన్నదాన సత్రం అసోసియేషన్ మంగళవారం నాడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి రూ.10 లక్షల చెక్కు అందజేసింది.

చంద్రబాబు

చంద్రబాబు

ఎయిర్ మార్షల్ అరుణ్ పురుషోత్తమ్ గరుడ్ విఎం మంగళవారం నాడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిశారు.

చంద్రబాబు

చంద్రబాబు

పద్మ అవార్డు గెలుచుకున్న మంజుల అనగాణిని మంగళవారం నాడు సత్కరిస్తున్న ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

చంద్రబాబు

చంద్రబాబు

ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం నాడు 35 నేషనల్ గేమ్స్ కోసం సెలక్ట్ అయిన వారికి క్రీడా పరికరాలు ఇస్తూ...

చంద్రబాబు

చంద్రబాబు

రూరల్ డెవలప్‌మెంట్ కమిషనర్ మంగళవారం నాడు ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి చెక్కును అందిస్తున్న దృశ్యం.

విశాఖ నగరంలో మైక్రోసాఫ్ట్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్‌ పెట్టాలని తాను ఆయనను డిమాండ్‌ చేశానని నవ్వుతూ చెప్పారు. తనకు ఆయనతో అంత చనువు ఉందన్నారు. దావోస్‌లో పెప్సీ కంపెనీ సీఈవో ఇంద్రానూయితో మాట్లాడి మన రాష్ట్రం నుంచి మామిడి, కొబ్బరి, అరటి, బొప్పాయి వంటివి కొనాలని కోరానని బాబు తెలిపారు. వచ్చే మార్చిలో చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీలో పెప్సీ కర్మాగారం ప్రారంభంకానుందని, దీనికి ఇంద్రనూయి రానున్నారని తెలిపారు.

వాల్‌మార్ట్‌ కంపెనీ సీఈవోతో మాట్లాడానని, కంపెనీల సామాజిక బాధ్యత కింద ఖర్చు పెట్టాల్సిన డబ్బును మన రాష్ట్రంలో టెక్నాలజీ అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆయన హామీ ఇచ్చారన్నారు. ఇరవై రకాల వ్యవసాయ ఉత్పత్తులను మన రాష్ట్రంలో కొనుగోలు చేస్తామని, డ్వాక్రా సంఘాల నుంచి కనీసం వంద రకాల వస్తువులను సేకరిస్తామని, మన వస్తువులకు అంతర్జాతీయ బ్రాండింగ్‌ కల్పిస్తామని, రైతులకు కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామని వాల్‌మార్ట్‌ సీఈవో చెప్పారన్నారు.

ఇన్ఫోసిస్‌ సీఈవో విశాల్‌ సిక్కా ఏపీలో ఒకచోట తమ సెంటర్‌ పెట్టడానికి ఆసక్తి చూపించారన్నారు. విశాఖలో విప్రో కంపెనీ రాబోతోంది. హిందూపురంలో ఉన్న సంతూర్‌ సబ్బుల ఫ్యాక్టరీని ఆ కంపెనీ విస్తరిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, విప్రో కలిసి ఒక సంయుక్త సంస్థగా ఏర్పడి ఇతర రాష్ట్రాల్లో సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులు, టెక్నాలజీ సర్వీసుల నిర్వహణ చేపట్టబోతున్నాయన్నారు.

హీరో సంస్థ తమ కర్మాగారానికి ఫిబ్రవరిలో శంఖుస్థాపన చేసి ఒక ఏడాదిలో ఉత్పత్తిలోకి తెస్తుందని, భారత్‌ ఫోర్జ్‌ సంస్థ ఫోర్జింగ్‌లో ప్రపంచంలో అగ్రగామిగా ఉందని, ఆ కంపెనీ సీఈవో కల్యాణ్‌ ఏపీలో పరిశ్రమ స్థాపనకు అంగీకరించారని, ప్రపంచ ఆర్థికసంస్థకు అనుబంధంగా ఉన్న ఇండియా గ్లోబల్‌ కౌన్సిల్‌ రెండేళ్లపాటు ఏపీతో కలిసి పని చేయడానికి ముందుకు వచ్చిందన్నారు.

ప్రపంచంలో అభివృద్థి చెందిన దేశంగా ఉన్న జపాన్‌ కాలక్రమంలో కొన్ని విషయాల్లో వెనకబడిందని, కానీ ఆ విషయాల్లో మనం నెగ్గుకొస్తున్నామని చంద్రబాబు చెప్పారు. జపాన్‌ అభివృద్ధి తీరును వివరించారు. దావోస్లో.. జపాన్‌ ఎక్కడ వెనకబడుతోందన్న దానిపై ప్రపంచ ఆర్థిక సదస్సు సమావేశాల్లో ప్రత్యేకంగా ఓ కార్యక్రమం నిర్వహించారన్నారు.

అభివృద్ధిలో ఒకప్పుడు దూసుకుపోయిన జపాన్‌ ఇప్పుడు వెనకబడటానికి మూడు కారణాలను ఆ దేశంవారే వివరించారన్నారు. జనాభాను పెంచుకోలేకపోవడంతో 2030 నాటికి ఆ దేశ జనాభా భారీగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడిందని.. ప్రపంచంలో ఇతర దేశాలు తమ దేశాల్లోకి వలసలను ప్రోత్సహిస్తే జపాన్‌ ఆ పని చేయలేదని.. ప్రపంచీకరణకు దూరంగా ఉండిపోవడం వల్ల కూడా దేశానికి నష్టం వాటిల్లిందని.. జపనీయులు తమ దేశం వెనకబాటును విశ్లేషించారన్నారు. వాళ్ల బలహీనతలన్నీ మనకు బలాలేనని అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+