నీళ్లలో శవాలు తేలుతున్నాయి..విజయవాడలో వాస్తవ పరిస్థితిని వివరించిన మహిళ ( వీడియో)
గతంలో ఎన్నడూ లేనంతగా విజయవాడ వరద గుప్పిట్లో చిక్కుకుంది. విజయవాడను మూడు మార్గాల్లో వరద నీరు చుట్టుముట్టింది.భారీగా కురిసిన వర్షానికి వంతెనలు తెగిపోయాయి. దీంతో విజయవాడ నగరం మొత్తం జలదిగ్భందంలో చిక్కుకుంది. విద్యాధరపురం, ఆర్ఆర్ నగర్, విజయవాడ సెంట్రల్ బస్ స్టాండ్, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ ప్రాంతాల్లో రహదారులు జలమయం అయ్యాయి.ముఖ్యంగా పైపుల రోడ్డు, సింగ్ నగర్ వంటి ప్రాంతాలు పూర్తి జలమయంగా మారాయి.
నాలుగు రోజులుగా ఆహారం కూడా అందక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అయితే వర్షం తెరపించడంతో వరద ఉదృతి కాస్తా తగ్గు ముఖం పట్టింది. కానీ ఇప్పటికి విజయవాడలో కొన్ని లోతట్టు ప్రాంతాలు మాత్రం ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. గత నాలుగు రోజులుగా అక్కడి ప్రజలకు తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. మరికొందరికి తాగడానికి నీరు కూడా దొరకడం లేదు. తాజాగా విజయవాడలో వాస్తవ పరిస్థితి ఎలా ఉందో ఓ మహిళ సెల్ఫీ వీడియో ద్వారా తెలియజేశారు. విజయవాడ లోతట్టు ప్రాంతాల్లో 50కి పైగా శవాలు ఉన్నాయని ఆమె తెలిపింది.

కనీసం తినడానికి తిండి లేకపోయిన పర్వాలేదు కానీ, తాగడానికి మంచి నీళ్లు కూడా ఇవ్వడం లేదని ఆ మహిళ వాపోయింది. శవాలు వాసన వస్తున్నాయని, చంటి పిల్లలతో ఎలా ఉండాలని ఆమె ప్రశ్నించింది. పడవకు రూ.10 వేలు నుంచి 40 వేలు వసూలు చేస్తున్నారని ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. నాలుగు రోజులుగా తిండి లేకుండా ఉన్నామని, మమ్మల్ని పట్టించుకుంది లేదని , చాలా భయంగా ఉందని ఆమె చెప్పుకొచ్చింది. ప్రభుత్వం అందిస్తోన్న సాయం అన్ని ప్రాంతాలకు చేరడం లేదు. అయితే ఇదే అదునుగా కొందరు దందాకు తెరలేపారు. విజయవాడలో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఈ వరదలకి పేదలు చావాల్సిందేనా...? ఓతల్లి ఆక్రందన#VijayawadaFloods #AndhraFloods #APRains #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/T2Iqa2xSJI
— oneindiatelugu (@oneindiatelugu) September 3, 2024
అయితే అవి ఏమాత్రం సరిపోకపోవడంతో దళారులు తమ దందాను మొదలుపెట్టారు. ప్రజల భయాన్ని తమ పెట్టుబడిగా మార్చుకున్నారు. జలదిగ్బదంలో ఉన్న ప్రజలను ఒడ్డుకు చేర్చినందుకు మనిషికి రూ. 40 వేల రూపాయిలు వసూలు చేస్తున్నారు. విజయవాడలో వరద బాధితులకు ప్రభుత్వం ఆహారం, పాలు, నీళ్లు అందిస్తున్నా క్షేత్రస్థాయిలో కొందరు వాటిని సొమ్ము చేసుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. లీటర్ వాటర్ బాటిల్ రూ.100, పాల ప్యాకెట్ రూ.150 కు అమ్ముతున్నారని వరద బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హెలికాప్టర్ల ద్వారా జారవిడుస్తున్న ఆహారాన్ని కొందరు ఎక్కువ మోతాదులో తీసుకెళ్లి అమ్ముకుంటున్నారని, దీంతో అందరికి అందడం లేదని ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications