Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రాజమండ్రిలో కిడ్నీలు పాడై నలుగురు మృతి..నలుగురి పరిస్థితి విషమం.. కల్తీ పాలే కారణమా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజమహేంద్రవరంలో కిడ్నీ సమస్యలతో ఆసుపత్రులలో చేరిన వారిలో మరో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది ఈరోజు తెల్లవారుజామున లాల చెరువు చౌడేశ్వరి నగర్ కు చెందిన ఎన్ శేషగిరిరావు, రాధాకృష్ణమూర్తి మృత్యువాత పడ్డారు. ఇంకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరో నలుగురి పరిస్థితి చాలా విషమంగా ఉంది.

వాంతులు, మూత్ర విసర్జన కాక ఆస్పత్రిలో 14 మంది

రాజమహేంద్రవరంలో ఒకే ప్రాంతానికి చెందిన పలువురు ఏకకాలంలో కిడ్నీ వ్యాధి బారినపడి ఆసుపత్రులలో చేరిన విషయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లాలా చెరువు సమీపంలోని చౌడీశ్వరి నగర్ ప్రాంతంలో ఈనెల 15వ తేదీ తర్వాత నుంచి వాంతులతో, మూత్ర విసర్జన కాకపోవడంతో, పొట్ట ఉబ్బడం తదితర సమస్యలతో దాదాపు 14 మంది ఆసుపత్రులలో చేరారు. ఇది స్థానికంగా తీవ్ర కల్లోలం రేపింది.

death toll reached four in Rajahmundry milk tragedy Four in critical condition case under investigation

అందరికీ పాలు పోసింది ఒకే వ్యక్తి.. పాల కల్తీ కారణమా

ఆస్పత్రి పాలైన ప్రతి ఒక్కరికి ఒకే వ్యక్తి పాలు సరఫరా చేయడం, పాలలో కల్తీ జరిగి ఉండొచ్చు అన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. కల్తీ పాల కారణంగానే ఈ విధంగా జరిగి ఉండొచ్చని వారు వైద్యాధికారులు, పోలీసులకు బాధితులు తెలిపారు. శివరాత్రి రోజు పాలు, పెరుగు చేదుగా ఉన్నాయని కొందరు బాధితులు పోలీసులకు వెల్లడించారు.

ఇప్పటికి నలుగురు మృతి, నలుగురి స్థితి విషమం

ఇప్పటికే ఈ ఘటనలో 76సంవత్సరాల భాగిశెట్టి కనక రత్నం, 75సంవత్సరాల తాడి కృష్ణవేణి మృతిచెందగా, తాజాగా 72 సంవత్సరాల ఎన్ శేషగిరిరావు 74 ఏళ్ల రాధాకృష్ణమూర్తి మృతి చెందారు. బాధితులలో ఎక్కువమంది 60 సంవత్సరాలకు పైబడిన వారే కాగా, ఒక ఐదు నెలల శిశువు మూడేళ్ల బాలుడు కూడా ఉన్నారు. ఒకే కుటుంబం నుంచి నలుగురు ఒకేసారి అస్వస్థతకు గురికావడంతో ఆదివారం నాడు ఈ విషయం అధికారుల దృష్టికి వచ్చింది.

పాల వ్యాపారిని విచారిస్తున్న పోలీసులు

కోరుకొండ మండలానికి చెందిన గణేష్ అనే పాల వ్యాపారి వీరికి ఈ పాలను అందిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఇప్పటికే అతను విక్రయించే పాలను ల్యాబ్ కు పంపించడంతో పాటు బాధితుల రక్త మూత్ర నమూనాలను టాక్సికాలజీ పరీక్షలకు పంపించారు.

కల్తీ పాల వ్యవహారంతో ఆందోళన

ఇంకా ఈ నివేదికలు రావలసి ఉంది. ఏది ఏమైనా ఏపీలోని రాజమహేంద్రవరంలో ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం కలకలం రేపుతుంది. ప్రతి ఒక్కరికి ఆందోళన కలిగిస్తుంది. అసలు ఏం జరిగింది ఎందుకు ఇంతమంది అస్వస్థతకు గురయ్యారు అన్నది తెలియాల్సి ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+