జగన్ కోసం జనం అంతలా ఎందుకు - ఢిల్లీ నేతలకు కీలక నివేదిక..!!

ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకుంది. కూటమి లోని మూడు పార్టీలు తమ బలం పెంచుకునే ప్రయత్నాలు కొన సాగిస్తున్నాయి. టీడీపీ నేతలు వైసీపీ లక్ష్యంగా వ్యూహాలు అమలు చేస్తోంది. ఇదే సమయంలో జగన్ టీడీపీని టార్గెట్ చేస్తూ పోరుబాట మొదలు పెట్టారు. పరామర్శల పేరుతో జిల్లాలకు వెళ్తున్న సమయంలో భారీ జన స్పందన కనిపిస్తోంది. ఇదే ఇప్పుడ రాజకీయంగా చర్చకు కారణమైంది. ఇదే అంశం పైన ఢిల్లీ నేతలు సైతం ఆరా తీసినట్లు తెలుస్తోంది. కీలక అంశాలు ఈ సమయంలో రాజకీయంగా ఆసక్తిని పెంచుతున్నాయి.

మారుతున్న లెక్కలు
ఏపీలో కూటమి పాలన ఏడాది పూర్తవుతున్న వేళ.. 12 నెలల కాలంగా రాష్ట్రంలో పాలన.. రాజకీ య అంశాల పైన చర్చ జరుగుతోంది. కాగా.. కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో తాము సాధించి న విజయాలను ప్రజల ముందుకు తీసుకొస్తోంది. ఇక.. 2024 ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితం అయిన జగన్.. ఓటమి తరువాత తన పొరపాట్లను సరి దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాను అధికారంలో ఉన్న సమయంలో కేడర్ ను నిర్లక్ష్యం చేసిన జగన్.. ఈ సారి ప్రాధాన్యత ఇస్తానని ప్రతీ సందర్భంలో చెబుతున్నారు. జిల్లాల వారీగా పర్యటనలు చేయాలని భావించినా.. కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి అయిన తరువాత వెళ్లాలని నిర్ణయించారు. ఇక.. వైసీపీ కేసులు పలు ఆరోపణల్లో అరెస్ట్ అవుతున్నారు. ఈ అరెస్టు ల పైన ప్రభుత్వాన్ని జగన్ టార్గెట్ చేస్తున్నారు.

delhi-seek-reports-on-huge-response-for-jagan-tours-from-state-leaders-as-reports

జన స్పందనతో
జగన్ ఎన్నికల్లో ఓటమి తరువాత వారంలో మూడు రోజులే తాడేపల్లిలో ఉంటున్నారు. మిగిలిన సమయం బెంగళూరులో ఉంటున్నారు. కాగా, జగన్ పరామర్శల కోసం జిల్లాలకు వెళ్లిన సమయం లో జనం నుంచి అనూహ్య స్పందన కనిపిస్తోంది. దీని పైనే ఢిల్లీ నేతలు ఆరా తీసినట్లు విశ్వసనీ య సమాచారం. సర్వే సంస్థలు.. బీజేపీ కోసం తెర వెనుక పని చేస్తున్న ముఖ్యుల నుంచి నివేదిక లు తీసుకున్నట్లు తెలుస్తోంది. జగన్ కు 2024 ఎన్నికల్లో 40 శాతం ఓటింగ్ వచ్చింది. ఏడాది కాలంలో జగన్ కు వచ్చిన ఓటింగ్ లో మార్పు రాలేదని నివేదకలో పేర్కొననట్లు తెలుస్తోంది. అదే సమయంలో కూటమి ప్రభుత్వం పథకాల అమలు విషయంలో తాత్సారం చేయటంతో జగన్ పాలనలో పథకాలు తీసుకున్న వారంతా ఇప్పుడు అసంతృప్తితో ఉన్నట్లు గుర్తించారు. కొన్ని జిల్లా ల్లో కూటమి ఎమ్మెల్యేల వ్యవహార శైలి ప్రజల్లో ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు.

తగ్గని ఆదరణ
కూటమి ప్రభుత్వం ఒక్కొక్కటిగా సూపర్ సిక్స్ అమలు చేసినా.. జగన్ కు తొలి నుంచి మద్దతుగా నిలిచిన ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోవటం సాధ్యం కాదని టీడీపీ నేతలు సైతం అంగీకరిస్తు న్నారు. కూటమిలో మూడు పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో సమన్వయం కొరవడిందని ఆ నివేదిక లో స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అదే విధంగా వరుస కేసులు.. అరెస్ట్ లు కూడా వైసీపీ పైన కొన్ని వర్గాల ప్రజల్లో సానుభూతి పెరుగుతున్నట్లు గుర్తించిన అంశాన్ని ప్రస్తావించినట్లు సమాచారం. కూటమిలోని మూడు పార్టీల కేడర్ లోనూ సంతృప్తి కనిపించటం లేదనే వాదన ప్రస్తావించనట్లు తెలుస్తోంది. జగన్ - టీడీపీ ఓట్ బ్యాంక్ దాదాపు సమానంగా ఉంది. కూటమితో కలవటంతో భారీ మెజార్టీ దక్కింది. తొలి నుంచి జగన్ కు మాస్ ఫాలోయింగ్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. దీంతో, ఇప్పుడు కూటమి నేతలు జగన్ లక్ష్యంగా ఎలాంటి కొత్త వ్యూహాలు అమలు చేస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+