టీ జోష్: బైక్‌పై దామోదర, వెనక సీట్లో అంజన్ (పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంపై ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ మంచి జోష్ మీద కనిపిస్తున్నారు. తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రి వర్గం ఆమోదించడంపై కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన ఊరేగింపు నిర్వహించారు.
పార్లమెంటు సభ్యులు వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్‌లతో కలిసి ఆయన శుక్రవారం హైదరాబాదులోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి ఊరేగింపు నిర్వహించారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఆ తర్వాత బాబూ జగ్జీవన్ రామ్, అంబేడ్కర్ విగ్రహాలకు నివాళులు అర్పించారు.
హైదరాబాదులోని నెక్లెస్ రోడ్డులో గల ఇందిరా గాంధీ విగ్రహం వరకు దామోదర రాజనర్సింహ, వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ ఊరేగింపు జరిపారు.

బైక్‌ను నడుపుతూ దామోదర
తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడాన్ని హర్షిస్తూ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పార్లమెంటు సభ్యులు వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్‌లతో కలిసి ర్యాలీ తీశారు. వెనక సీట్లో అంజన్ కుమార్ యాదవ్‌ను కూర్చోబెట్టుకుని బైక్ నడిపిన దామోదర.

ఓపెన్ టాప్ వాహనంలో...
దామోదర రాజనర్సింహ, అంజన్ కుమార్ యాదవ్, వి. హనుమంతరావు ఓపెన్ టాప్ జీపులో హైదరాబాదులో ఊరేగింపు నిర్వహించారు.

అమరవీరులకు నివాళులు..
తెలంగాణ నోట్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందడంతో సోనియాకు, మన్మోహన్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ దామోదర, విహెచ్, అంజన్ కుమార్ ఊరేగింపు జరిపారు.

జై తెలంగాణ..
తెంలగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ హర్షం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ నినాదాలు చేశారు.

ముగ్గురి సంబరాలు..
తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించడంతో హైదరాబాదుకు చెందిన నాయకులు దామోదర రాజనర్సింహ, వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ సంబరాల్లో మునిగి తేలారు.

జగ్జీవన్ రామ్‌కు నివాళి
తెలంగాణ నోట్ కేంద్ర మంత్రివర్గ ఆమోదం పొందడాన్ని హర్షిస్తూ ఊరేగింపు తీసిన దామోదర, విహెచ్, అంజన్ కుమార్ యాదవ్ బాబూ జగ్జీవన్ రామ్‌కు నివాళులు అర్పించారు.

విహెచ్‌కు కేక్ తినిపిస్తూ అంజన్
తెలంగాణ నోట్ కేంద్ర మంత్రి వర్గం ఆమోదం పొందినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వి హనుమంతరావుకు స్వీట్ తినిపిస్తున్న సికింద్రాబాద్ పార్లమెంటు సభ్యుడు అంజన్ కుమార్ యాదవ్

అంబేడ్కర్‌కు నివాళి
తెలంగాణ నోట్ కేంద్ర మంత్రివర్గం ఆమోదం పొందిన నేపథ్యంలో హైదరాబాదులో ఊరేగింపు నిర్వహించి దామోదర, విహెచ్, అంజన్ కుమార్ యాదవ్ శుక్రవారం ట్యాంక్‌బండ్ వద్ద గల బాబూ అంబేడ్కర్ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.

సోనియా భారీ కటౌట్
తెలంగాణ నోట్‌ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిన నేపథ్యంలో శుక్రవారం దామోదర రాజనర్సింహ, వి. హనుమంతరావు, అంజన్ కుమార్ యాదవ్ సోనియా గాంధీకి, ప్రధాని మన్మోహన్ సింగ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సోనియా గాంధీ భారీ కటౌట్ వద్ద ఆ నేతలు ఇలా..












Click it and Unblock the Notifications