వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పవన్ కళ్యాణ్ కు సవాల్ చేసి, చంద్రబాబుపై విరుచుకుపడిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

|
Google Oneindia TeluguNews

ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి తెలుగుదేశం పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టిడిపి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎన్టీఆర్ పేరు పలికే అర్హత కూడా చంద్రబాబుకు లేదని పేర్కొన్న డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఎన్నికల్లో ఎన్టీఆర్ ఫోటో లేకుండా ఒక్క సీట్ అయినా గెలవగలరా అంటూ సవాల్ విసిరారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ను సైతం టార్గెట్ చేసిన ఆయన పవన్ కళ్యాణ్ పొత్తులతో కాకుండా సింగిల్ గా పోటీ చేయాలంటూ చాలెంజ్ చేశారు.

ఎవరో కన్నబిడ్డకు, ఇంకేవరో బర్త్ డే చేసినంత చంఢాలంగా టీడీపీ ఆవిర్భావ కార్యక్రమం: సాయిరెడ్డిఎవరో కన్నబిడ్డకు, ఇంకేవరో బర్త్ డే చేసినంత చంఢాలంగా టీడీపీ ఆవిర్భావ కార్యక్రమం: సాయిరెడ్డి

ఓట్ల కోసం చంద్రబాబు నాటకాలు ఆడటం మానుకోవాలని హితవు: నారాయణ స్వామి

ఓట్ల కోసం చంద్రబాబు నాటకాలు ఆడటం మానుకోవాలని హితవు: నారాయణ స్వామి


డిప్యూటీ సీఎం నారాయణస్వామి బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్టీఆర్ పెట్టిన మద్యనిషేధం, రెండు రూపాయల బియ్యం పథకాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఎన్నికల సమయంలోనే చంద్రబాబుకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారని, ప్రజల దగ్గర ఓట్ల కోసమే ఎన్టీఆర్ పేరును చంద్రబాబు వాడుకుంటారు అని ఆరోపించారు. ఓట్ల కోసం చంద్రబాబు నాటకాలు ఆడటం మానుకోవాలని హితవు పలికారు. చంద్రబాబు ఏనాడైనా ఎన్టీఆర్ పథకాలను అమలు చేశాడా అంటూ ప్రశ్నించారు.

పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి

పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి


పవన్ కళ్యాణ్ కు ఓపెన్ ఛాలెంజ్ చేసిన డిప్యూటీ సీఎం నారాయణస్వామి పవన్ కళ్యాణ్ కు దమ్ముంటే సింగిల్ గా పోటీ చేయాలని, పొత్తులు లేకుండా గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఇక వీక్ గా ఉండేవారే పొత్తులు పెట్టుకుంటారని ఎద్దేవా చేసిన నారాయణస్వామి వచ్చే ఎన్నికల్లో పొత్తుల కోసం పాకులాడుతున్నారని ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేశారు. ఇక చంద్రబాబు ఎన్టీఆర్ వారసుడు ఎలా అవుతారు అని ప్రశ్నించిన నారాయణస్వామి చంద్రబాబు, లోకేశ్ సొంతంగా పార్టీ పెట్టి ఎన్నికల బరిలోకి దిగాలని, ఎన్టీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాలు చేయడం మానుకోవాలని హితవు పలికారు.

కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా?

కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా?


కొత్త పార్టీ పెట్టి ఎన్నికల్లో గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించిన నారాయణస్వామి, పేదవాళ్ల పట్ల చంద్రబాబుకు ఎటువంటి ప్రేమ లేదని, చంద్రబాబు తన పాలన సమయంలో పేదల కష్టాలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో నాడు నేడు కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలకు కొత్త హంగులు తీసుకువచ్చారని పేర్కొన్నారు. కానీ చంద్రబాబు హయాంలో చేసిన ఒక మంచి పని లేదని, ఒక గొప్ప పథకం లేదని నారాయణస్వామి మండిపడ్డారు.

 పొత్తులు లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి వైసిపిపై గెలిచి చూపించాలని సవాల్

పొత్తులు లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి వైసిపిపై గెలిచి చూపించాలని సవాల్


ఎన్టీఆర్ మద్యనిషేధం చేస్తే ఇక సారా వ్యాపారం చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని నారాయణస్వామి నిప్పులు చెరిగారు. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని తాము కూడా డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. పొత్తులు లేకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి వైసిపిపై గెలిచి చూపించాలి అంటూ సవాల్ చేశారు. మరోవైపు మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణపై వ్యాఖ్యలు చేసిన ఆయన మంత్రులు ఎవరికీ అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. ఎవరికి ఏ పదవి ఇచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోసం అంతా కలిసి పని చేస్తామని డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెల్లడించారు.

English summary
AP Deputy CM Narayana Swamy was outraged chandrababu over tdp foundation day. Narayana Swamy challenged Pawan Kalyan to compete single in coming elections
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X