ఎక్స్ ప్రెస్ - మెయిల్ మధ్య తేడా?
భారతదేశంలో చాలా మంది ప్రజలు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లడానికి ఎక్కువగా రైళ్లపై ఆధారపడుతుంటారు. సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల మధ్య తేడా ఎలా విభజిస్తారో తెసుకుందాం? భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్, indianrailways.gov.in ప్రకారం మేజర్ లైన్‌లో గంటకు 55 కిలోమీటర్లు, బిజీ మార్గంలో గంటకు 45 కిలోమీటర్లు ఉంటే దానిని సూపర్ ఫాస్ట్ రైలుగా భావిస్తారు.
ఆ రైలుకు సూపర్ ఫాస్ట్ హెడ్ ఛార్జీ వేస్తారు. కొన్ని సూపర్ ఫాస్ట్ రైళ్లు కూడా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఈ రైళ్ల ప్రత్యేకత ఏమిటంటే వాటికి తక్కువ స్టాపేజ్‌లు ఉండి కేవలం ఒకటి రెండు స్టేషన్లలో మాత్రమే ఆగుతాయి. ఎక్స్‌ప్రెస్ రైలు భారతదేశంలో పాక్షిక ప్రాధాన్యత కలిగిన రైలు. వీటి వేగం గంటకు 55 కిలోమీటర్లు. ఎక్స్‌ప్రెస్ రైలు వేగం మెయిల్ రైలు కంటే ఎక్కువ అయినా సూపర్‌ఫాస్ట్ రైలు కంటే తక్కువ వేగంతో వెళ్తుంది.

మెయిల్ రైలు వంటి వివిధ ప్రదేశాలలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఉండదు. ఎక్స్‌ప్రెస్ రైలు పేరు ఎక్కువగా నగరం, ప్రదేశం లేదా వ్యక్తి పేరు నుంచి పెడతారు. ఇందులో జనరల్, స్లీపర్, ఏసీ కోచ్‌లు ఉంటాయి. గంటకు పరిమిత సగటు వేగంతో నడిచే రైళ్లను మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైళ్లు అంటారు. ఈ రైలు ప్రధాన నగరాలను కవర్ చేస్తుంటుంది. మెయిల్-ఎక్స్‌ప్రెస్ రైలు వేగం సూపర్‌ఫాస్ట్ కంటే తక్కువగా ఉండటంతోపాటు అది గంటకు 50 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. అధిక సంఖ్యలో మెయిల్, ఎక్స్ ప్రెస్ రైళ్ల నెంబర్లు 123తో ప్రారంభమవుతాయి.












Click it and Unblock the Notifications