అధికారం అండతో రెచ్చిపోయిన స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీ.. వెలుగులోకి బాగోతం

ప్రజలకు సేవ చేయాల్సిన గౌరవ ప్రదమైన పదవిలో ఉండి కూడా.. కొందరు మాత్రం అధికారం అండతో అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు. ఇప్పటికే ఎందరో అధికారుల రాసలీలల బాగోతాలు బయటపడ్డాయి. ఈరోజు తెలంగాణలో జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ వ్యవహారం హాట్ టాపిక్ గా బయటపడిన తరుణంలో.. ఏపీలో మరో అధికారి వికృత చేష్టలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.

ఏపీలోని గుంటూరు జిల్లాలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిఐజీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కిరణ్. అయితే ఈయన వికృత చేష్టలు మాత్రం వెంటే.. ఈ వయసులోనే ఇలా ఉంటే.. ఆ వయసులో ఇంకెలా ఉన్నారో అని అందరూ అనడం ఖాయం. అంతే కాకుండా కట్టుకున్న భార్యని సైతం ఈ రకంగా చిత్ర హింసలు పెట్టిన ఆ కిరాతకుడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు ధ్వజమెత్తుతున్నాయి.

DIG of Stamps and Registration shocking behaviour into limelight

కిరణ్ భార్య ఎల్ఐసీ లో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేస్తున్నారు. భార్య, పిల్లతో హ్యాప్పీగా ఉండాల్సింది పోయి.. అధికారం అండతో పలువురు మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు కిరణ్. కట్టుకున్న భార్యను మాత్రం చిత్ర హింసలు పెడుతూ.. వేరే మహిళలతో ఉన్న ఫోటోలు పంపి మానసికంగా వేధించేవాడని వాపోతుంది. ఇదేంటని ప్రశ్నిస్తే తనని, పిల్లలని చావగొట్టేవాడని కన్నేటి పర్యంతం అవుతోంది.

కిరణ్ గత రాత్రి భార్యను చితకబాదడంతో.. ఆమె స్పృహ కోల్పోయింది. సమాచారం మేరకు ఆమెను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు బంధువులు. ఈ మేరకు ఆయనపై అరండల్ పేట స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన అరండల్ పేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. అయితే భార్యకు అండగా వచ్చిన బందువులపై సైతం అట్రాసిటి కేసు పెడతానని కిరణ్ బెదిరించినట్టు సమాచారం.

మరోవైపు జీహెచ్ఎంసీ అడ్మిన్‌లో జాయింట్ కమిషనర్ గా పనిచేస్తున్న జానకిరామ్‌ను వేరే మహిళతో భార్య కళ్యాణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. జానకిరామ్ తనకంటే 20 ఏళ్ల చిన్న వయసున్న అమ్మాయితో వివాహేతర బంధం పెట్టుకున్నారు. ఆ అమ్మాయితో ఉండగా.. భార్య కళ్యాణి పట్టుకొని ఇద్దరినీ చితకబాదింది. గత కొద్దిరోజులుగా భర్తఇంటికి రాకపోవడంతో ఎక్కడికి వెళుతున్నాడని భార్య కళ్యాణి నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే సికింద్రాబాద్ వారాసిగూడలో అపార్ట్మెంట్లో ఉన్నట్లు గుర్తించింది. దాంతో ఇద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. ఘటన స్థలానికి వారాసిగూడ పోలీసులు చేరుకొని ఇద్దరిని పోలీస్ స్టేషన్‌కి తరలించారు.

ఈ దాడిలో గాయాలపాలైన జానకీరామ్‌ను ప్రస్తుతం చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే... వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకు ఇప్పటికే పెళ్లి అయినట్లు తెలుస్తోంది. వారిని స్టేషన్‌కి తరలించిన పోలీసులు.. కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే కోర్టులో తేల్చుకోవాలని శాంతిభద్రతలకు భంగం కలిగించవద్దని పోలీసులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+