మందుబాబులకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం
ఏపీ రాజకీయాల్లో మద్యం కూడా ప్రధాన పాత్ర పోషించిందని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు. ముఖ్యంగా 2019 ఎన్నికల అనంతరం వైఎస్ జగన్ ప్రభుత్వంపై ప్రధానంగా వినిపించిన ఆరోపణల్లో లిక్కర్ బ్రాండ్ల అంశం ప్రత్యేకం అనే చెప్పాలి. ఏపీలో దొరికే బ్రాందీ, విస్కీ, బీర్ల పేర్లపై ట్రోలింగ్స్ కూడా గట్టిగా జరిగేవి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై జగన్ స్పందించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూడా మద్యం గురించే ప్రధాన చర్చ సాగింది. తాము అధికారంలోకి రాగానే నాణ్యమైన మద్యాన్ని తక్కువ ధరకే అందిస్తామని చంద్రబాబు, పవన్ మందుబాబులకు హామీ ఇచ్చారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న మద్యం చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో అనుమతి తీసుకున్నవే అని దీనిపై వైసీపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఇదిలా ఉంటే మరోవైపు అన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వపు వైన్స్‌లో డిజిటల్ చెల్లింపులు ఉన్నప్పటికి..ఏపీలో మాత్రం డిజిటల్ చెల్లింపులకు అనుమతి లేదు. దీంతో క్యాష్ తప్పనిసరిగా చేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి.మద్యం షాపులో క్యూ లైన్ లో నిల్చొవడం, అలాగే చేతిలో సరిపడా డబ్బులు లేకపోవడం, చిల్లర సమస్య అనేది ఎక్కువ చిరాకు తెప్పిస్తోంది.ఏపీ ప్రభుత్వంపై దీని గురించి కేంద్రానికి ఈ ఫిర్యాదులు అందాయి. అంతేకాకుండా.. మద్యం షాపుల్లో నగదు పక్కదారి పడుతోందనేది ప్రతిపక్షాలు ఆరోపించాయి. దీంతో మద్యం షాపుల్లో డిజిటిల్ లావాదేవీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఏపీ మద్యం షాపుల్లో డిజిటిల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారు. కొన్ని జిల్లాలోని షాపుల్లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక మరికొన్ని జిల్లాల్లోని మద్యం షాపులో 70 నుంచి 80శాతం వరకు డిజిటల్ చెల్లింపులు జరుగుతున్నాయి. వాటిలో ఎక్కువగా ఫోన్ పే, పేటీఎం, గూగుల్ పే, కార్డుల ద్వారా వినియోగదారులు చెల్లింపులు జరుపుతున్నారు. మద్యంషాపుల్లో డిజిటల్ పేమెంట్స్ సేవలు అందుబాటులోకి తీసుకురావడంతో మందుబాబులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.












Click it and Unblock the Notifications