నన్ను కుక్క కరువబోయింది, రక్షించండి: బిజెపి ఎమ్మెల్యే విష్ణు
హైదరాబాద్: ఏపీ అసెంబ్లీలో గురువారం నాడు కుక్కలు, పందుల విషయం చర్చకు వచ్చింది. విశాఖలో కుక్కల గురించి బిజెపి శాసన సభాపక్ష నేత విష్ణు కుమార్ రాజు ప్రస్తావించారు. ఓ సమయంలో నన్ను కూడా కుక్క కరువబోయిందని, కుక్కల బాధ నుంచి రక్షించాలని విష్ణు అన్నారు. కర్నూలులో పందుల బెడదను వైసిపి ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి ప్రస్తావించారు.
సభ ప్రారంభమైన తర్వాత మారిన నిబంధనల మేరకు స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ప్రశ్నోత్తరాలను చేపట్టారు. విశాఖలో ఏకంగా 1,00,395 కుక్కలు ఉన్నాయని విష్ణు కుమార్ రాజు చెప్పారు. కుక్కల కారణంగా జనం బెంబేలెత్తుతున్నారన్నారు.
కుక్కల బెడద నుంచి జనాన్ని రక్షించాలని కోరారు. ఓ సందర్భంలో తనను కూడా ఓ కుక్క కరవబోయిందని, తాను ఎలాగోలా తప్పించుకున్నానని చెప్పారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరిశాయి. కుక్కల గోలపై విష్ణు కుమార్ రాజు చేసిన ప్రసంగంతో సభ్యులతో పాటు స్పీకర్ కోడెల శివప్రసాద్ కూడా కడుపుబ్బా నవ్వారు.

కర్నూలు నగరంలో పందుల బెడద తీవ్రంగా ఉందని ఎస్వీ మోహన్ రెడ్డి అన్నారు. ముగ్గురు పిల్లలను పందులు కరిచి చంపేశాయన్నారు. అవి కనిపిస్తే కాల్చి చంపేయాలన్న ఉత్తర్వులు ఉన్నా, ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు.
పందుల నివారణకు వెంటనే చర్యలు చేపట్టారన్నారు. అయితే, సుప్రీం తీర్పు ప్రకారం కుక్కలను చంపేందుకు వీల్లేదని, అందువల్ల స్టెరిలైజేషన్ ద్వారా కుక్కులను నియంత్రిస్తున్నామని మంత్రి నారాయణ చెప్పారు.
-
ఆ విషయంలో ఎవరిమాట వినొద్దు అని కలెక్టర్ లకు సీఎం చంద్రబాబు ఆదేశం! -
ఉచిత విద్యుత్, రూ. 25,000 ప్రసూతి సాయం: ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టిన విజయ్ -
ఏప్రిల్ 14న మేషరాశిలోకి సూర్యుడు.. వీరి పంట పండుతుంది! -
పాకిస్థాన్ లో బర్రెలకు డైపర్లు.. లేదంటే రోజుకు రూ.30 పన్ను కట్టాల్సిందే.. -
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం!












Click it and Unblock the Notifications