ముంపు: ఏ రాష్ట్ర ఎమ్మెల్యేనో తెలియడం లేదన్న తాటి

ఈ విషయంపై తాను సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. శుక్రవారం ఆయన అశ్వారావుపేటలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో తెలంగాణ ప్రాంతమైన తన స్వగ్రామం కన్నాయిగుట్టను ఏపిలో విలీనం చేయడం వల్ల తాను ఏ రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేనో తనకే అంతుపట్టడం లేదని చెప్పారు.
తనకు ఓట్లేసి గెలిపించిన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలతోపాటు తననూ ఏపికి చెందిన వ్యక్తి గా ఆర్డినెన్స్ మార్చివేసిందని అన్నారు.
ఇప్పుడు రెండు రాష్ట్రాల్లోనూ తన శాసనసభ నియోజకవర్గ ప్రజలున్నారని.. ప్రస్తుతం తాను ఏ రాష్ట్ర శాసనసభ్యుడిననేది స్పష్టం కావడం లేదని వైయస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత తాటి వెంకటేశ్వర్లు తెలిపారు.












Click it and Unblock the Notifications