దువ్వాడ కుటుంబ కథా చిత్రమ్: భార్య వాణి సూపర్ ట్విస్ట్.. దువ్వాడ ఫిక్స్!!
దువ్వాడ కుటుంబ కథా చిత్రం ఇంకా మొగలిరేకులు సీరియల్ ఎపిసోడ్ లాగా సాగుతూనే ఉంది. ఆస్తులు ఇచ్చి విడాకులు ఇస్తే తన దారిని తాను వెళతానని భర్త ముందు ఐదు డిమాండ్లను పెట్టిన వాణి తాజాగా కొత్త పాట అందుకున్నారు. మా ఆయనతో కలిసి ఉండటానికి తాము రెడీ అంటున్నారు.
ఇంకా దువ్వాడ శ్రీనివాస్ ఇంటి ముందే వాణి
వాణి దువ్వాడ శ్రీనివాస్ ముందు పెట్టిన ఐదు డిమాండ్లలో కొత్తగా కట్టిన ఇంటి నుండి మినహాయించి మిగతా అన్ని డిమాండ్లకు దువ్వాడ శ్రీనివాస్ ఒప్పుకున్నారు. కొత్తగా కట్టిన ఇంటిని మాత్రం అడగొద్దని ఆయన తేల్చి చెప్పారు. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు జరిపిన చర్చలకు మధ్యలోనే బ్రేక్ పడింది. ఇక దువ్వాడ వాణి మాత్రం టెక్కలిలోని దువ్వాడ శ్రీనివాస్ కొత్త ఇంటి ముందు ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నారు.

కలిసుందాం అని రాజీ బాటలో వాణి
అయితే దువ్వాడ శ్రీనివాస్ తాను తీసుకున్న నిర్ణయాన్ని కచ్చితంగా చెప్పి ఆపై తన ఇష్టం అంటూ కొత్త ఇంటిని మాత్రం వారి పేరుమీద వీలునామ రాసేది లేదని స్పష్టం చేశారు. ఇక కొత్తగా మాట మార్చిన వాణి రాజీమార్గంలోకి వెళ్లారు. రాజకీయాలు, ఆస్తులు తనకు అక్కర్లేదని, తమను ఇంట్లోకి రానిస్తే చాలని, కూతుళ్ళ భవిష్యత్తు కోసం, సమాజం కోసం అందరం కలిసి ఉందామని దువ్వాడ శ్రీనివాస్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.
వాళ్ళతో కలిసి ఉండేది లేదన్న దువ్వాడ
ఇందులో భాగంగా ఎటువంటి షరతులు పెట్టిన తమ సిద్ధంగా ఉన్నామని దువ్వాడ వాణి తెలిపారు. అయితే దువ్వాడ శ్రీనివాస్ మాత్రం ససేమిరా అంటున్నారు. తనకున్న 30 కోట్ల ఆస్తుల్లో 27 కోట్ల ప్రాపర్టీని దువ్వాడ వాణికి రాసిస్తానికి సిద్ధంగా ఉన్నానని చెప్పిన ఆయన ఇప్పటికే జరగాల్సిన డ్యామేజీ అంతా జరిగిందని వాళ్లని ఇంట్లోకి రానిచ్చేది లేదని స్పష్టం చేశారు. వాళ్లతో కలిసి ఉండే సమస్య లేదంటూ తేల్చి చెప్పారు.
కోర్టులో తేల్చుకుందాం అంటున్న దువ్వాడ
తన కొత్త ఇంటి జోలికి రావద్దని హెచ్చరించారు. ఇక వాణి పిల్లల బాధ్యత తనదేనని చెప్పిన దువ్వాడ శ్రీనివాస్ వివాదం కోర్టు దాకా వెళ్ళింది, కాబట్టి కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటానంటూ తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉంటే దువ్వాడ వాణి దువ్వాడ శ్రీనివాస్ ఇంటి దగ్గరికి వచ్చి ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేసిన సమయంలో తన ఇంట్లోకి దువ్వాడ వాణి ఆమె బంధువులు చొరబడ్డారని దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.
వాణికి నోటీసులు ..దువ్వాడకు ఇచ్చాకే ఇవ్వమన్న వాణి
వాణికి 41 ఏ నోటీసులు ఇవ్వడానికి పోలీసులు రాగా నోటీసులు తీసుకునేందుకు వాణి నిరాకరించారు. తాను కూడా తన పైన, తన కూతురు పైన దాడి చేస్తారని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశానన్న వాణి దువ్వాడకు నోటీసు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
విడాకుల నోటీసులపై దువ్వాడ, వాణి ఇలా
ఈనెల 21వ తేదీన తనపై భార్య వాణి నమోదు చేసిన గృహహింస కేసులో వాయిదాకు హాజరు కావలసి ఉందని పేర్కొన్న దువ్వాడ తాను వాణికి విడాకుల నోటీసులు పంపానని చెబుతున్నారు. అయితే ఆమె మాత్రం ఆ నోటీసులు తనకు అందలేదని చెబుతున్నారు. ఏది ఏమైనా దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో భార్య రాజీ మార్గానికి రావడం ఆసక్తిని కలిగిస్తుంది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు











Click it and Unblock the Notifications