భూకంపాలు, బాబుకు ఊరట!: సేఫ్‌జోన్‌లో రెండు తెలుగు రాష్ట్రాలు
న్యూఢిల్లీ: భారత దేశంలో ఎక్కడ భూకంపాలు వస్తాయో గుర్తిస్తూ రాష్ట్రాల వారీగా సృజనాత్మక మ్యాప్‌ల తయారీ సంతోషకరమని కేంద్రమంత్రి, బీజేపీ నేత వెంకయ్య నాయుడు మంగళవారం అన్నారు. భూకంపం కేంద్రాల విషయంలో తెలుగు రాష్ట్రాలు సేఫ్ జోన్‌లో ఉన్నాయని చెప్పారు.
తెలుగు రాష్ట్రాల మ్యాప్‌లను కేంద్రమంత్రి వెంకయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. అయిదు నెలల క్రితమే మ్యాపులను తయారు చేశామని చెప్పారు. తెలంగాణ మ్యాప్ లేకపోవడంతో ఇప్పటి వరకు ఆవిష్కరించలేదన్నారు.

భూకంపాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు లేదన్నారు. తెలంగాణలో ప్రకృతి వైపరీత్యాలు మిగతా రాష్ట్రాల కంటే చాలా తక్కువ అని వెంకయ్య నాయుడు చెప్పారు. కాగా, ఈ వార్త తెలుగు రాష్ట్రాలకు మంచి వార్తే. ముఖ్యంగా ఏపీ రాజధాని భూకంపాల జోన్‌లో ఉందనే భయం నేపథ్యంలో వెంకయ్య వ్యాఖ్యలు గమనార్హం.












Click it and Unblock the Notifications