నారా లోకేష్ ఇక తాజా మాజీ: బాంబు పేల్చిన కేంద్ర ఎన్నికల సంఘం..!!

ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏడు స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. మార్చి 3వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది.

అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, శాసన మండలి సభ్యుడు నారా లోకేష్.. త్వరలోనే తాజా మాజీ కాబోతోన్నారు. ప్రస్తుతం ఆయన యువ గళం పేరుతో పాదయాత్ర నిర్వహిస్తోన్నారు. చిత్తూరు జిల్లాలో కొనసాగుతోందీ పాదయాత్ర. నారా లోకేష్ శాసన మండలి సభ్యత్వం ఇక గడువు పూర్తి కాబోతోంది. మరోసారి తెలుగుదేశం పార్టీ తరఫున శాసన మండలికి ఎన్నికయ్యే అవకాశం లేదు.

స్థానిక కోటాలో..

స్థానిక కోటాలో..

రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల కోలాహలం నెలకొన్న విషయం తెలిసిందే. మొత్తం 14 నియోజకవర్గాలకు మార్చిలో పోలింగ్ జరుగనుంది. ఇందులో స్థానిక సంస్థలు-9, గ్రాడ్యుయేట్ నియోజకవర్గాలు-5 ఉన్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. ఏకగ్రీవ విజయాలను ఖాయం చేసుకుంది. ఇప్పటికే అయిదు చోట్ల వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వైసీపీ ఏకగ్రీవం..

వైసీపీ ఏకగ్రీవం..

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోటాలో ఏకగ్రీవమైన వారిలో అనంతపురం-మంగమ్మ, చిత్తూరు-డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, కడప- పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, తూర్పు గోదావరి-కుడుపూడి సూర్యనారాయణ, నెల్లూరు- మేరిగ మురళీధర్ ఉన్నారు. స్థానిక సంస్థలు, గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గాల కోసం మార్చి 13వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మార్చి 16న ఓట్ల లెక్కింపు చేపడతారు. ఇక శ్రీకాకుళం- నార్తు రామారావు, పశ్చిమ గోదావరి- వంకా రవీంద్రనాథ్, కావూరు శ్రీనివాస్, కర్నూలు- ఏ మధుసూదన్ పోలింగ్ ను ఎదుర్కొనాల్సి ఉంది.

ఎమ్మెల్యేల కోటాలో..

ఎమ్మెల్యేల కోటాలో..

ఎమ్మెల్యేల కోటాలో ఏడు స్థానాలకు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది. దీనికి సంబంధించిన షెడ్యూల ను కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు విడుదల చేశారు. ఈ కోటాలో విజయనగరం- వీవీ సూర్యనారాయణ రాజు, బాపట్ల- పోతుల సునీత, విశాఖపట్నం- కోలా గురువులు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ- బొమ్మి ఇజ్రాయెల్, ఏలూరు- జయమంగళ వెంకటరమణ, గుంటూరు-చంద్రగిరి ఏసురత్నం, పల్నాడు- మర్రి రాజశేఖర్ ఎన్నిక కావాల్సి ఉంది. ఈ ఏడు స్థానాలు కూడా వైఎస్ఆర్సీపీ ఖాతాలోకి వెళ్తాయి..

ఇదీ షెడ్యూల్..

ఇదీ షెడ్యూల్..

ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన 10 మంది శాసనమండలి సభ్యుల పదవీకాలం మార్చి 29వ తేదీన ముగుస్తుంది. 2017లో వారంతా మండలికి ఎన్నికయ్యారు. వీరిలో ఏపీ-7 తెలంగాణ-3 స్థానాలకు ఎన్నికలను నిర్వహించనుంది ఈసీ. మార్చి 6వ తేదీన ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలో శాసనమండలి సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ వెలువడుతుంది. నామినేషన్లను దాఖలు చేయడానికి చివరి తేదీ మార్చి 13. 14వ తేదీన అభ్యర్థులు దాఖలు చేసిన నామినేషన్లు పరిశీలిస్తారు. 16వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఉంటుంది.

మార్చి 23న..

మార్చి 23న..

మార్చి 23వ తేదీన పోలింగ్ షెడ్యూల్ అయింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. శాసన సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. దీనికోసం అసెంబ్లీ ఆవరణలో ప్రత్యేకంగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు అధికారులు. అదే రోజు సాయంత్రం 5లకు ఓట్లను లెక్కిస్తారు. 25వ తేదీ నాటికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవుతుంది.

ఖాళీ అయ్యేది వీరే..

ఖాళీ అయ్యేది వీరే..

ఎమ్మెల్యే కోటాలో ఏపీలో మొత్తం ఏడు శాసన మండలి స్థానాలు ఖాళీ కానున్నాయి. తెలుగుదేశం పార్టీ సభ్యుడు నారా లోకేశ్, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్య వర ప్రసాదరావు, వీవీ సూర్య నారాయణ రాజు, గంగుల ప్రభాకర్ రెడ్డి పదవీ కాలం ముగుస్తుంది. చల్లా భగరీథ రెడ్డి హఠాన్మరణం వల్ల ఖాళీగా ఉన్న స్థానానికీ పోలింగ్ జరుగుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+