సోనియా, రాహుల్ కు ఈడీ భారీ షాక్.. ! ఆస్తుల స్వాధీనం మొదలు..

కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు, ఎంపీలు కూడా అయిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీకి ఇవాళ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ భారీ షాకిచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వీరిద్దరికీ సంబంధించిన ఆస్తుల్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియను ఈడీ ప్రారంభించింది. ఈ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సోనియా, రాహుల్ ఆస్తుల్ని త్వరలో స్వాధీనం చేసుకోబోతోంది.

సోనియా, రాహుల్ వాటాదారులుగా ఉన్న యంగ్ ఇండియన్ సంస్థ గతంలో కాంగ్రెస్ పార్టీ పత్రిక నేషనల్ హెరాల్డ్ ను నడిపిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను స్వాధీనం చేసుకునే క్రమంలో భారీగా డబ్పులు చేతులు మారాయని ఈడీ అభియోగాలు మోపింది. వీటికి సంబంధించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ యజమానులకు నిన్న ఈడీ నోటీసులు పంపింది. నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను ఒకప్పుడు ప్రచురించిన అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ను యంగ్ ఇండియా కొనుగోలు చేయడంలో ఆర్థిక అవకతవకలు, నిధుల దుర్వినియోగం జరిగినట్లు అభియోగాల్లో పేర్కొంది.

ED begins possession of sonia gandhi rahul Gandhi s assets in national herald case

యంగ్ ఇండియన్ రూ.2,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను నియంత్రించడానికి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ దీన్ని దురుద్దేశపూర్వకంగా స్వాధీనం చేసుకున్నారని ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న సుబ్రమణ్యస్వామి గతంలో ఆరోపించారు.దీనిపైనే కేసు నమోదు చేసిన ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఇందులో అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులకు సంబంధించిన రూ.988 కోట్ల నేరం ద్వారా వచ్చిన ఆదాయాన్ని మనీ లాండరింగ్ చేసినట్లు ఆరోపణలు నిర్దారణ కావడంతో 2023లో ఈ అటాచ్‌మెంట్ మొదలైంది. దీన్ని తాజాగా ఈడీ నిర్ధారించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+