జనసేనకు ఎన్నికల సంఘం మరో షాక్

ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... గుర్తింపు పొందిన జాతీయ, ప్రాంతీయ పార్టీలు, గుర్తింపు లేని పార్టీల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారం విడుదల చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ప్రకారం .. గుర్తింపు పొందిన ప్రాంతీయ పార్టీల జాబితాలో వైసీపీ, టీడీపీ ఉన్నాయి. వైసీపీకి ఫ్యాన్ గుర్తు, టీడీపీకి సైకిల్ గుర్తును కేటాయించారు. రిజిస్టర్డ్ పార్టీల జాబితాలో జనసేన ఉంది.

జనసేన గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్స్ జాబితాలో ఈసీ ఉంచింది. ఇది ఇప్పుడు జనసేన పార్టీను కలవరపాటుకు గురి చేస్తోంది. జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తును ఇప్పటికే ప్రజల్లోకి తీసుకు వెళ్లే ప్రయత్నాలు చేస్తోంది. జనాల్లో కూడా గ్లాసు గుర్తు బాగా పాపులర్ అయ్యింది. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా ఈ సింబల్‌ను ప్రమోట్ చేసుకునే ప్రయత్నం చేశారు. వైసీపీ అధినేత జగన్ తన ఎన్నికల ప్రచారంలో జనసేన గుర్తుపై సెటైర్లు వేస్తున్నారు.

Election Commission is another shock for Janasena

తాగేసిన టీ గ్లాస్ సింక్‌లోనే ఉండలంటూ కామెంట్ చేస్తుంటే.. గ్లాజు పగిలే కొద్ది పదును ఎక్కువ అవుతుందంటూ జగన్ కామెంట్స్‌కు పవన్ కౌంటరిస్తున్నారు. ఇలాంటి సమయంలో గాజు గుర్తుకు సంబంధించి ఈసీ నిర్ణయంతో జనసేన నేతల్లో కొత్త టెన్షన్ మొదలైంది. ఇప్పటికే ఈ అంశంపై న్యాయ నిపుణులతో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చర్చించినట్టుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే జనసేనకు మరో కొత్త తలనొప్పి ఎదురయ్యేలా కనిపిస్తోంది.

జనసేన పోటీలో లేనిచోట ఇండిపెండెంట్‌ అభ్యర్థులకు గాజు గుర్తు కేటాయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది జనసేనతో పాటు కూటమిపై పార్టీల విజయావకాశాలపై ప్రభావం చూపిస్తుందని జనసేన నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫ్రీ సింబల్‌గా ఉన్నప్పటికీ గ్లాజు గ్లాసును తమకే కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరతామని జనసేన నాయకులు చెబుతున్నారు. దీనిపై త్వరలోనే కేంద్ర ఎన్నికల సంఘానికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జనసేన నాయకులు సిద్ధమవుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+