అనకాపల్లి ఎంపీగా ఎంవీఆర్ పోటీ ఖాయం..ఇంతకీ ఎవరీ ఎంవీఆర్..?

ఎవరీ ఎంవీఆర్.. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారిన పేరు.. అనకాపల్లి పార్లమెంట్ నియోజవర్గం నుంచి రాజకీయ ఆరంగేట్రం చేస్తున్న సుప్రసిద్ధ పారిశ్రామికవేత్త.. ఎన్ని సార్లు ఆహ్వానించినా ఏ రాజకీయ పార్టీలోనూ చేరకుండా సొంతంగానే ఉత్తరాంధ్రలో తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకున్న అపరదాన కర్ణుడు..ఆయన సై అనగానే రెండు ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డాయి.. స్థానిక రాజకీయ సమీకరణాలు మారిపోయిన పరిస్థితి.. అయితే ఎంవీఆర్ మాత్రం ఆచితూచి అడుగేయాలని నిర్ణయించుకున్నారు.. గెలిచే పార్టీలోనే చేరాలని నిర్ణయించుకున్నారు. ఇందుకనుగుణంగా సర్వేలు కూడా చేయిస్తున్నారు..

ఒక వేళ రకరకాల సమీకరణాల వల్ల తాను అనుకున్న పార్టీ టికెట్ దక్కకపోతే ఇండిపెండెంట్ గా బరిలో దిగి తన సత్తా చూపిస్తా అంటూ సవాల్ విసురుతున్నారు.ఇంతకీ ఎవరితను..? ఏంటి తన బలం..బలగం.. రాజకీయ పార్టీలకే సవాల్ విసిరే సాహసం ఎందుకు చేస్తున్నారు.

Entrepreneur mutyala venkateswara rao contest to anakapalli mp

అనకాపల్లి జిల్లాలో కాపులదే ఆధిపత్యం..ఆ తర్వాత యాదవుల ఓట్లు గణనీయంగా ఉంటాయి..అనకాపల్లి నియోజవర్గంలో కాపు అభ్యర్థి అయితే గెలుపు సునాయాసం..అందుకే కాపులంతా ఇక్కడ నుంచి పోటీ చేయడానికి ఉవ్విళ్లూరుతుంటారు..ఈ నేపథ్యంలో కాపు సామాజిక వర్గానికే చెందిన ఎంవీఆర్ ఇక్కడ బరిలో ఉంటే విజయం అవలీలగా దక్కుతుందనేది రాజకీయ పండితుల అంచనా..

ఎంవీఆర్ ప్రముఖ పారిశ్రామికవేత్త.. ఆర్థికంగా అత్యంత బలవంతుడిగా చెబుతారు.. తనకు అవకాశం లభిస్తే తన నియోజకవర్గం పరిధిలోని ఏడుగురు ఎమ్మెల్యేలను అవలీలగా గెలిపించుకోగలుగుతాడు..ఏడు నియోజక వర్గాల్లోనూ ఎంవీఆర్ సుపరిచితుడు..తన ఎంవీఆర్ గ్రూపు సంస్థల్లో పని చేసే ఉద్యోగులంతా ఈ నియోజకవర్గానికి చెందినవారే కావడం..ఎంవీఆర్ గ్రూపు సంస్థలకు మంచి పేరు ఉండటం కలిసివచ్చే మరో అంశం..

Entrepreneur mutyala venkateswara rao contest to anakapalli mp

రాజకీయ పార్టీలు కూడా తమ పార్టీ తరఫున నిలబడే అభ్యర్థికి ఢిల్లీ స్థాయిలో పలుకుబడి ఉంటాలని కోరుకుంటాయి.. ఎంవీఆర్ ఆ విషయంలో అందరికంటే ముందుంటారు.. వ్యాపారపరంగా.రాజకీయ పరంగా ఎంవీఆర్ కు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ దాకా మంచి పలుకుబడి ఉంది.. బ్యూరోక్రాట్లు..ప్రముఖ వ్యాపారవేత్తలతో సత్సంబంధాలున్నాయి.

ఎంవీఆర్ గత నలభై ఏళ్లుగా స్థానికంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు.తన ఉద్యోగులను సొంత కుటుంబంలా చూసుకుంటారని చెబుతారు. మహిళా ఉద్యోగులను ప్రత్యేక వాహనాల్లో ఇంటిదాకా దింపివస్తారు..ఉత్తరాంధ్రలోని యువతను ఒక దారి చూపాలని తపన పడుతుంటారు..చదువు రాని వారికి వృత్తిశిక్షణ ఇప్పించి దుబాయ్ దాకా ఉద్యోగాలు కల్పిస్తారు.. చదువుకున్న నిరుద్యోగ యువత కోసం సాఫ్ట్ వేర్ సంస్థలు నెలకొల్పుతున్నారు. ఇలా తన నియోజకవర్గం కోసం గత రెండు దశాబ్దాలుగా తపన పడుతున్న వ్యక్తి..ఇది మరొక ప్లస్ అని చెబుతుంటారు..

ఇక సేవా కార్యక్రమాల గురించి చెబితే అదొక సంచలనం..చేతికి ఎముక లేకుండా సాయం చేయడంలో ఎంవీఆర్ కు సాటి మరొకరు రారు అంటే అతిశయోక్తి కాదు.. సాయం కోసం తన ఇంటికి వచ్చిన వారికి ఉట్టి చేతులతో వెనక్కి పంపిన చరిత్ర లేదు అంటారు..రూపాయికే అన్నం పెడుతుంటారు..మెడికల్ క్యాంపులు నిర్వహిస్తారు. ఆపరేషన్లకు ఆర్థిక సాయం చేస్తుంటారు.. అనకాపల్లి జిల్లాలో ఆయన సాయం పొందని వారు అరుదు అంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.. అంతటి సేవామూర్తి కావడం ఎంవీఆర్ కు కలిసివచ్చే అంశం..

ఆధ్యాత్మిక రంగంలోనూ ఎంవీఆర్ కృషి అనన్యసామాన్యం.. అపర భక్తాగ్రేసరుడు ఎంవీఆర్.. ఏడాదిలో ఆరు నెలల పాటు మాలలోనే ఉంటారు.. ఏడాది పొడవునా దైవ సంబంధిత కార్యక్రమాలు నిర్వహిస్తారు.. జీర్ణాలయాలను పునరుద్ధరిస్తారు..కొత్త ఆలయాలకు నిధులు సమకూరుస్తారు.. కళ్యాణాలు జరిపిస్తారు.. వృద్ధులను ప్రతీరోజూ తన సొంత బస్సుల్లో ఉచితంగా పుణ్య క్షేత్రాలకు పంపిస్తారు..ఇవన్నీ ఎంవీఆర్ ను ప్రతీ ఒక్కరు తమ సొంత కుటుంబ సభ్యునిలా భావించేలా చేశాయి.

Entrepreneur mutyala venkateswara rao contest to anakapalli mp

ఆయన కోసం పని చేసే ఒక యువసేన నే ఉంది..వారు ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఎంవీఆర్ చేసే సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటారు..

ఇంత చరిత్ర ఉంది కాబట్టే ఎంవీఆర్ ఒంటరిగా నిలబడ్డాడు.. తనకంటూ సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు.. అందుకే ఆయన పార్టీలకు సవాల్ విసరగలుగుతున్నాడు.. తానే పార్టీని ఎంచుకోవాలనుకుంటున్నారు.అందుకే ఎంవీఆర్ ఇండిపెండెంట్ గా బరిలో నిలుస్తారని వార్తలు రాగానే అనకాపల్లి జిల్లా రాజకీయుల్లో అలజడి మొదలైంది. ఎంవీఆర్ దిగితే దబిడి దిబిడే మరి.. చూద్దాం ఎంవీఆర్ తదుపరి వ్యూహం ఎలా ఉండబోతోందో....?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+