అట్టర్ ప్లాప్: కెసిఆర్‌పై ఎర్రబెల్లి, కాళ్లు పట్టుకున్నారని..

ఉద్యోగులను, ప్రజలను రెచ్చగొట్టడానికి కెసిఆర్ ఇప్పుడు ప్రతిపక్ష నేత కాదన్న విషయం గుర్తుంచుకోవాలని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పోలవరంపై పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కాళ్లు పట్టుకున్న రోజున పోలవరం ముంపు గ్రామాలు గుర్తుకు రాలేదా అని మండిపడ్డారు.
ఉద్యోగుల పంపిణీ విషయంలో కెసిఆర్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారమే ఉద్యోగుల విభజన జరుగుతుందని అన్నారు. టిడిపి తెలంగాణ అధ్యక్షుడు, అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ ఎవరన్నది పార్టీ నాయకత్వంతో చర్చించి నిర్ణయిస్తామని చెప్పారు. టిడిపి తెలంగాణ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్ పదవి ఎవరికిచ్చిన సంతోషమేనని అన్నారు. తెలంగాణ ప్రయోజనాలను టిడిపి కాపాడుతుందని చెప్పారు.
బాబును గౌరవిస్తాం, తొందరపడొద్దు: గుత్తా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును తాము గౌరవిస్తామని కాంగ్రెస్ ఎంపి గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. అయితే తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడితే ఊరుకోమని హెచ్చరించారు. పోలవరం ముంపు గ్రామాల విషయంలో కేంద్ర ప్రభుత్వం తొందరపడవద్దని ఆయన సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, చంద్రశేఖర్ రావు కలిసి ఈ విషయంపై చర్చించాలని కోరారు. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications