బాబు బొమ్మతో టిలో గెలిచా, గల్ల పట్టి: కెసిఆర్‌పై ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమంలో తెలంగాణ టిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు తెరాస అధ్యక్షులు, కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన బుధవారం నిప్పులు చెరిగారు. చంద్రబాబు దయాదాక్షిణ్యాలతో మంత్రి అయిన విషయాన్ని కెసిఆర్ మర్చిపోవద్దని హితవు పలికారు. టిడిపి వల్లే కెసిఆర్ రాజకీయాల్లో పైకొచ్చారన్నరు.
ఆనాడు ఎన్టీఆర్ దగ్గరకు వచ్చి కొడుకుకు తారక రామారావు అని పేరు పెట్టుకున్నాడన్న విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబే తెలంగాణను అభివృద్ధి చేశారన్నారు. సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. తెలంగాణ ఏర్పాటును టిడిపి ఎన్నడు వ్యతిరేకించలేదని చెప్పారు. ఇంకోసారి టిడిపిని ఆంధ్రోళ్ల పార్టీ అంటే గల్లపట్టి గుంజుతామన్నారు. కెసిఆర్‌కు పోలవరం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కుటుంబంతో సహా సోనియాను కెసిఆర్ ఎందుకు కలిశారని ప్రశ్నించారు.

చంద్రబాబు తెలంగాణను ఎప్పుడు, ఎక్కడ వ్యతిరేకించారో చెప్పాలన్నారు. ఆంధ్రకు న్యాయం చేసి తెలంగాణ ఇవ్వాలని చెప్పారన్నారు. అన్నదమ్ముల్లా విడిపోయినా అందరం కలిసిమెలిసి ఉందామన్నారు. తెరాస ఇప్పటికైనా రెచ్చగొట్టే విధానం మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణ కోసం విద్యార్థులు చనిపోతున్నారనే చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చారన్నారు. తాను చంద్రబాబు బొమ్మతోనే పాలకుర్తిలో గెలిచానని చెప్పారు.
తెలంగాణను చంద్రబాబు అభివృద్ధి చేశారన్నారు. తెలంగాణ అభివద్ధిపై తాము చర్చకు సిద్ధమని చెప్పారు. కెసిఆర్ వార్ రూంలోని వార్ పదాన్ని తొలగించి బార్ అని పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. చంద్రబాబు వల్లే తాము తెలంగాణలో 15 స్థానాల్లో గెలుపొందామన్నారు. సమన్వయం లేక మరో పదిహేను స్థానాల్లో ఓడిపోయామన్నారు. కార్యకర్తల కోసం నిధి ఏర్పాటు అన్న లోకేష్ సూచన అభినందనీయమన్నారు.












Click it and Unblock the Notifications