అదే ఉంటే కాపులు పవన్ తోనే - జగన్ తో ఎందుకు ఉంటారు : పేర్ని నాని..!!
ముసులుగు తీసేసి కలిసి కట్టుగా రావాలని పేర్ని నాని జనసేనానికి సవాల్ చేసారు.
భారతీయ జనతాపార్టీతో కటింగు టీడీపీతో మెర్జింగ్ ఇదే మచిలీపట్నంలో పవన్ టోటల్ సభ సారాంశమని మాజీ మంత్రి పేర్ని నాని తేల్చి చెప్పారు. మచిలీపట్నంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ చేసిన వ్యాఖ్యల పైన పేర్ని నాని స్పందించారు. తొడలు కొట్టే రాజకీయం పవన్ కళ్యాణ్ దేనని చెప్పారు. తమకు అవసరం లేదన్నారు. ధుర్యుధోనుడు, ధృతరాష్ట్రుళ్ళు పవన్ పక్కనే ఉన్నారని ఫైర్ అయ్యారు. తమకు శిస్తు వేయటం పవన్ వల్ల..వాళ్ల నాయకుడి వల్ల కూడా కాదని పేర్కొన్నారు. సొంత అన్ననే హేళన చేశారని ఫైర్ అయ్యారు.

బీసీలకు ఇచ్చిన మాట ఏమైంది
బందర్ లో బీసీ డిక్లరేషన్ అని బీసీలకు మాటిచ్చిన పవన్ 48 గంటలు కూడా అవ్వక ముందే బీసీ డిక్లరేషన్ మాట మర్చిపోయారని పేర్ని నాని ఎద్దేవా చేసారు. కాపులను రెచ్చగొట్టేలా పవన్ మాట్లాడుతున్నారు. పవన్ మాట్లావేవన్నీ అసత్యాలేనన్నారు. కుల రహితంగా బతకాలి అని ఓ పక్కన చెబుతూ కాపులని రెచ్చగొట్టేలా మాట్లాడటం పవన్ కే చెల్లిందని పేర్ని దుయ్యబట్టారు. కాపులందరికీ జగన్ మీద ప్రేమ ఎందుకు, చంద్రబాబు మీద ద్వేషం ఎందుకు అని పవన్ అడగటం హాస్యాస్పదం అన్నారు. గతంలో చంద్రబాబు కోసమే లోపాయికారీగా జనసేన పనిచేసిందన్నారు.
ముసుగు ఎందుకు..నేరుగా రండి
ఇప్పుడు కూడా చంద్రబాబుకు అధికారం తెచ్చిపెట్టడం కోసమే పనిచేస్తోందని విమర్శించారు. ఈ మాత్రం దానికి ముసుగు ఎందుకని ప్రశ్నించిన పేర్ని నాని..అన్ని పార్టీలూ కలిసే రావాలని సవాల్ చేసారు. పదేళ్లు పార్టీ నడిపాను అని చెబుతూ..తనకు సినీ జీవితాన్ని ఇచ్చిన అన్న చిరంజీవినే పవన్ కించపరిచి మాట్లాడాడన్నారు. పవన్ మంచివాడివైతే, పద్ధతిగలవాడివైతే కాపులు నీవెనకే ఉండేవాళ్లు, జగన్ వెంట ఎందుకు ఉంటారని ప్రశ్నించారు. నమ్మిన సిద్ధాంతం కోసం, నమ్మినవాళ్ల కోసం, చెప్పిన మాట కోసం జగన్ ఏదైనా కోల్పోవడానికి సిద్ధంగా ఉంటారన్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి వస్తామని కార్మికులు సరిగ్గా చేయి పైకెత్తి చెప్పలేదని, అందుకే స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని వదిలేసానని అనడం విచిత్రమన్నారు.













Click it and Unblock the Notifications