లా పరీక్షలో కాపీ కొడుతూ పట్టుబడ్డ గుంటూరు మాజీ ఎమ్మెల్యే

గుంటూరు: మార్చి నెల వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో పరీక్షల హడావుడి మొదలవుతుంది. ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో పలువురు విద్యార్ధులు కాపీ కొడుతూ పట్టుబడిన సంగతి తెలిసిందే. అయితే ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నేతలే అడ్డదార్లు తొక్కి అడ్డంగా దొరికిపోయిన ఘటనలు గతంలో చాలానే చూశాం.

తాజాగా ఓ ఓ ఎమ్మెల్యేగా సేవలందించిన వ్యక్తి, న్యాయ పరీక్షల్లో మాస్ కాపీయింగ్‌కు పాల్పడి అడ్డంగా దొరికిపోయిన సంఘటన ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పీసీసీ ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలీ గురువారం లా మొదటి సంవత్సరం పరీక్షల్లో కాపీ కొడుతూ దొరికిపోయారు.

 EX Mla mastanvali committed mass copying while writing llb exam in Guntur

గుంటూరు పట్టణంలోని ఏసీ కాలేజీలో లా మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతున్నాయి. ఈరోజు పరీక్షలకు హాజరైన ఆయన, పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన స్క్వాడ్ బృందానికి అడ్డంగా దొరికిపోయారు. కాపీ కొడుతున్న వారిలో మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలీతో పాటు యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఎస్.కె జిలానీ, బీజేపీ నేత భాస్కరరావు ఉన్నారు.

ఈయనతో పాటు కాపీ కొడుతున్న వారి జవాబు పత్రాలను స్వాధీనం చేసుకున్న అధికారులు కేసు నమోదు చేస్తామని వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+