జైలు నుంచి వల్లభనేని వంశీ రిలీజ్..
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో నిన్న ( జూలై 1, 2025 ) వంశీకి న్యూజివీడు సెకండ్ అడిషనల్ జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయలకు 2 ష్యూరిటీలు, వారానికి రెండుసార్లు స్టేషన్ కి రావాలంటూ కోర్టు షరతులు పెట్టింది.
2019 ఎన్నికల్లో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు నకిలీ ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన ఆరోపణలతో.. అదే ఏడాది అక్టోబర్ 18న హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. వంశీతో సహా 9 మందిపై ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు.

ఈ కేసుతో పాటు ఇప్పటి వరకూ ఆయనపై నమోదైన భూకబ్జా, గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి, సత్యవర్థన్ కిడ్నాప్ కేసులతో సహా అన్ని కేసుల్లో బెయిల్ రావడంతో కాసేపటి క్రితం విజయవాడ డిస్ట్రిక్ట్ జైలు నుంచి విడుదలై బయటకు వచ్చారు. కాగా వల్లభనేని వంశీపై 11 మొత్తం కేసులు నమోదు అయ్యాయి. ఫిబ్రవరి 16న ఏపీ పోలీసులు వల్లభనేనిని హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు. నాటి నుంచి దాదాపు 140 రోజుల పాటు జైలులో ఉన్నారు వంశీ.
వంశీ సతీమణి పంకజ శ్రీ, వైఎస్సార్సీపీ కృష్ణ జిల్లా అధ్యక్షుడు పేర్ని నాని, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్, కైలే అనిల్, పెనమలూరు నియోజకవర్గ ఇంచార్జ్ దేవ భక్తుని చక్రవర్తిలతో పాటు వైస్సార్సీపీ శ్రేణులు, వంశీ అభిమానులు జైలు వద్దకు భారీ ఎత్తున వచ్చి స్వాగతం పలికారు. వల్లభనేని వంశీ 2009, 2014లో తెలుగుదేశం పార్టీ తరఫున గన్నవరం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. తర్వాత చంద్రబాబుతో విభేదాలు రావడంతో పార్టీకి దూరంగా ఉన్నారు. 2019 తర్వాత వైసీపీకి మద్దతుగా వ్యవహరించారు. వంశీపై కేసులు రాజకీయ కుట్రలో భాగమేనని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
విజయవాడ సబ్ జైలు నుంచి వల్లభనేని వంశీ విడుదల#VallabhaneniVamsi #ApGovt #Chandrababu #SupremeCourt #VijayawadaSubJail #YSRCP #AndhraPradesh #NewsUpdate #Oneindiatelugu pic.twitter.com/mdrCXRRhCN
— oneindiatelugu (@oneindiatelugu) July 2, 2025
మరోవైపు వంశీ బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసింది. దీని పైన విచారణ చేసిన ఉన్నత న్యాయ స్థానం వంశీ ముందస్తు బెయిల్ రద్దుకు నిరాకరించింది. హైకోర్టు ఆదేశాలను సమర్థించింది.












Click it and Unblock the Notifications