ఫేస్‌బుక్ ద్వారా ఒక్కటయ్యారు, ఆత్మహత్య చేసుకున్నారు

తిరుపతి: చిత్తూరు జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియా వేదిక ద్వారా సహజీవనంలోకి వచ్చిన స్త్రీపురుషులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. చిత్తూరు జిల్ాల పుంగనూరు సమీపంలోని కొత్త ఇండ్లులో బుధవారం అర్థరాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం - పుంగనూరుకు చెందిన కె. రాజ్‌కుమార్ (27), కడపకు చెందిన జి. సుగుణ ఫేస్‌బుక్ ద్వారా పరిచయం చేసుకుని మిత్రులయ్యారు. ఆ తర్వాత సహజీవనం చేస్తూ వస్తున్నారు. మూడు నెలలుగా వారు కలిసి ఉంటున్నారు.

 Facebook live in couple ends life

మహిళకు ఇది వరకే వివాహమైంది. భర్తను వదిలేసి పుంగనూరు వచ్చి ఆమె రాజ్‌కుమార్‌తో ఉంటోంది. తనకు ఇది వరకే వివాహమైందనే విషషయాన్ని సుగుణ దాచిపెట్టింది. అలాగే, తన తల్లిదండ్రులకు నచ్చిన అమ్మాయితో సంబంధం పెట్టుకున్నట్లు రాజ్‌కుమార్ దాచాడు. అయితే, వారు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటనేది మాత్రం ఇంకా తెలియదు.

పసికందు మృతి చెందిన సంఘటన గురువారం చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో చోటుచేసుకుంది. చిన్నారి తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు - మండలంలోని పాళ్యంపల్లె పంచాయతీ జువ్వలదిన్నె తాండాకు చెందిన క్రిష్ణమూర్తినాయక్ కుమార్తె హారిక (5) గురువారం తన ఇంటి వద్ద ఆడుకుంటూ ప్రమాదవశాతు నీటితొట్టిలో పడి మృతి చెందింది. కన్న కూతురు మృతి చెందడంతో తల్లిదండ్రులు భోరున విలపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+