పడగవిప్పిన ఫ్యాక్షన్: తండ్రి కొడుకుల దారుణ హత్య
కర్నూలు: కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ పడగ విప్పింది. జిల్లాలోని కౌతాళం మండలం ఉరుకుందలో ఆదివారం ఉదయం పొలానికి వెళ్లిన తండ్రీ కొడుకులను ప్రత్యర్ధులు అతి కిరాతకంగా వేటకొడవళ్లతో నరికి చంపారు. ఈ ఘటనలో తండ్రీ కొడుకులు అక్కడిక్కడే చనిపోయారు.

పొలం వద్ద మాటువేసిన ప్రత్యర్థులు బాధితులపై వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. దాడి అనంతరం దుండగులు పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు.
బాధితులను రాఘవరెడ్డి, తిమ్మారెడ్డిలుగా పోలీసులు గుర్తించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు మొదలుపెట్టారు. దాడి నేపథ్యంలో గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications