కెఈXకోట్ల వర్గాలు, కర్నూల్లో భగ్గుమన్న ఫ్యాక్షన్ రాజకీయాలు: టిడిపి నేత మృతి

కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో మరోసారి ఫ్యాక్షన్ రాజకీయాలు భగ్గుమన్నాయి. ఇరువర్గాలు పరస్పరం దాడులకు పాల్పడ్డాయి. ఈ ఘటనలో తెలుగుదేశం పార్టీకి చెందిన నాగుర్ భాషా అనే వ్యక్తి మృతి చెందాడు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి.

ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వర్గీయుల మధ్య ఈ ఫ్యాక్షన్ అగ్గి రాజుకుంది. కర్నూలు జిల్లాలోని ప్యాపిలి మండలం మునిమడుగు గ్రామంలో ఈ ఉద్రిక్తత పరిస్థితి చోటు చేసుకుంది.

Faction: TDP leader dies in Kurnool

పాతకక్షల కారణంగానే గొడవలు జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. టిడిపికి చెందిన భాషా చనిపోగా, ఇరువర్గాలకు చెందిన ఐదుగురు గాయపడ్డారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషంగా ఉన్న వారిని కర్నూలులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇరువర్గాలు కర్రలు, రాళ్లు, కత్తులు చేతబట్టిన ఇరు వర్గాలు పరస్పరం దాడులకు దిగాయి. అనంతరం ఒక వర్గానికి చెందిన వారి ఇళ్లపై మరో వర్గం రాళ్ల వర్షం కురిపించింది. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులకు సమాచారం అందడంతో.. వారి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+