పక్కా వ్యూహంతో 'ఊపిరి' తీశారు: భార్యను ఫేస్‌బుక్ ద్వారా ఎరగా వేసి..
శత్రువుకు ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకొని, భార్యను ఎరగా వేసి చంపేసిన సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. అందుకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకున్నాడు.
గుంటూరు: శత్రువుకు ఉన్న బలహీనతను ఆసరాగా చేసుకొని, భార్యను ఎరగా వేసి చంపేసిన సంఘటన ఏపీలో చోటు చేసుకుంది. అందుకు సామాజిక అనుసంధాన వేదిక ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకున్నాడు. పోలీసులు దర్యాఫ్తు చేసి నిందితుడిని గుర్తించారు.
కండిపాడులోని పునాదిపాడు వద్ద అయిదు రోజుల క్రితం రాత్రి మంగలఘిరికి చెందిన రఫీ హత్య జరిగింది. ఈ కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను పోలీసులు శనివారం వెల్లడించారు.
షేక్ రఫీకి ఫేస్‌బుక్‌లో చాటింగ్ చేయడం హాబీ. రఫీ సోదరుడు నాగూర్ మే నెలలో అదే ప్రాంతానికి చెందిన కనకారావు అనే వ్యక్తి హత్య కేసులో నిందితుడు. మరో ఏడుగురు కలిసి అతను కనకారావును అడవుల్లోకి తీసుకెళ్లి పెట్రోలు పోసి దహనం చేసిన ఆరోపణలు వచ్చాయి.

చంపేందుకు పక్కా ప్లాన్
రఫీ పైన ఆరోపణలు రావడంతో పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఆధారాలు లేకపోవడంతో వదిలేశారు. దీంతో కనకారావు కుటుంబం రఫీపై పగ పెంచుకుంది. మంగళగిరికి చెందిన కనకారావు తమ్ముడు గోపీనాథ్, భార్య కృష్ణవేణి, తల్లి విజయలక్ష్మి, మేనమామ పాల చంటి, కనకారావు సోదరి పాల రాణి కలిసి వ్యూహం రచించారు. రఫీ బలాలు, బలహీనతలను గుర్తించారు.

అమ్మాయిలతో చాటింగ్ చేస్తాడని తెలుసుకొని.. 'ఊపిరి'
అతడు ఎక్కువగా అమ్మాయిలతో చాటింగ్ చేస్తాడని తెలుసుకున్నారు. కనకారావు హత్య తర్వాత మంగళగిరిని వదిలి పెనమలూరులోని చోడవరంనకు మకాం మార్చారు. రఫీకి ఫేస్‌బుక్‌లో అకౌంట్ ఉంటుంది. గోపీనాథ్ తన భార్య కృష్ణవేణి 'ఊపిరి... ఊపిరి' పేరుతో ఫేస్‌బుక్ అకౌంట్ తెరిపించాడు. దీని ద్వారా రఫీకి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించారు. అతడు అంగీకరించిన తర్వాత సందేశాలు పెట్టారు. దీనికి స్పందించిన రఫీ తిరిగి సందేశాలు పంపించాడు.

నీతో మాట్లాడాలని ఆమెకు చెప్పడంతో..
తనకు వస్తున్న మెసేజ్‌లు ఎవరో అమ్మాయి పంపిస్తోందని రఫీ తెలుసుకున్నాడు. కృష్ణవేణి చాటింగ్ చేస్తూ నకిలీ పేరును మెసేజ్ చేసింది. మాట్లాడాలని రఫీ చెప్పడంతో సెల్ నంబర్ మెసేజ్ చేసింది. అతడు ఫోన్ చేసినప్పుడల్లా మాట్లాడేది. నిన్ను చూడాలని, మనం ఒకచోట కలుసుకుందామని చెప్పాడు. ఈ నెల 21న గోపీనాథ్ భార్య కృష్ణవేణి... రఫీకి ఫోన్ చేసి కంకిపాడు గోశాల వద్దకు రమ్మని చెప్పింది.

ఆయుధాలతో బయలుదేరారు
దీంతో రఫీ, స్నేహితుడు జబ్బార్ అలియాస్ మున్నాతో కలిసి ద్విచక్ర వాహనంపై అక్కడకు వచ్చాడు. అక్కడి నుంచి ఆమెకు ఫోన్ చేయగా పునాదిపాడుకు రావాలని చెప్పింది. అప్పుడు నిందితులు అందరూ కలిసి ఆయుధాలతో పునాదిపాడులోని పొలాల వద్దకు బయలుదేరారు. ముందుగా కృష్ణవేణి, పాల రాణిలను అక్కడి దింపేసి మిగిలిన వారంతా వెనక్కి వచ్చారు. గోశాలకు వెళ్లే మార్గంలో ఉన్న ఓ బడ్డీ కొట్టు వద్ద రఫీ కూర్చుని సిగరెట్ తాగుతుండటాన్ని గుర్తించారు.

కృష్ణవేణితో మాట్లాడుతుండగా..
ఆ తర్వాత రఫీ బైక్‌పై అటు వైపుగా వెళ్లడాన్ని చూసి వెంటనే ఆటోను వెనక్కి తిప్పారు. కృష్ణవేణి, రాణిలతో రఫీ మాట్లాడుతుండగా.. ఆటోలోంచి దిగిన గోపీనాథ్, పాల చంటి, మల్లిక, విజయలక్ష్మి కత్తులు, రోకలితో దాడి చేశారు. ఈ దాడి నుంచి జబ్బార్ తప్పించుకోగా రఫీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కేసును నమోదు చేసిన పోలీసులు ఫేస్‌బుక చాటింగ్‌లో కృష్ణవేణి నంబర్‌ను పరిగణనలోకి తీసుకుని దర్యాప్తు చేయగా అసలు విషయం వెలుగు చూసింది. బయటపడింది. ఆరుగురి గ్యాంగ్‌ను కంకిపాడు పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications