ముప్పు తప్పింది: జిఎస్ఎల్వీ ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా షార్‌లో అగ్ని ప్రమాదం
నెల్లూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని శ్రీహరి కోట షార్ కేంద్రంలో గురువారం నాడు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. క్యాస్టింగ్ విభాగంలో జీఎస్‌ఎల్‌వీ డి-6 ప్రయోగానికి సంబంధించిన ఇంధనం మిక్సింగ్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి.
దీంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో షార్‌కు చెందిన ఉద్యోగి, ఒప్పంద ఉద్యోగికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మధ్యాహ్నం అగ్ని ప్రమాదం సంభవించింది. ఉద్యోగులు పరుగులు తీశారు.

వెంటనే, అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో, ఎలాంటి భారీ ప్రమాదంచోటు చేసుకోకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
అయితే ప్రమాదానికి గల కారణాలేమన్నవి ఇంకా తెలియరాలేదు. ఈ నెలాఖరున ఈ జీఎస్ఎల్వీని ప్రయోగించనున్నారు. సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్)లో గతంలో కడా ఇక్కడ ప్రమాదం సంభవించింది.












Click it and Unblock the Notifications