కాకినాడలో విషాదం: సముద్రంలో 5గురు మృతి, చినరాజప్ప ఆరా
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేట సముద్రం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో అయిదుగురు మృతి చెందారు. వారు పాలరేవు మండలం కాపులపాలెంకు చెందినవారిగా గుర్తించారు.
కాకినాడ: తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. సూర్యారావుపేట సముద్రం వద్ద సముద్రంలో ఈతకు వెళ్లిన తొమ్మిది మందిలో అయిదుగురు మృతి చెందారు. వారు పాలరేవు మండలం కాపులపాలెంకు చెందినవారిగా గుర్తించారు.
గురువారం మొత్తం తొమ్మిది మంది స్నానానికి అని సముద్రంలోకి దిగారు. అందులో అయిదుగురు మృతి చెందారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని జీజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు.

మృతి చెందిన వారిని శీలం దుర్గ, శ్రీను, వంశీ, పండు, పితాని అనితలుగా గుర్తించారు. తొమ్మిది మంది గల్లంతయిన విషయం తెలియగానే ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప జిల్లా ఎస్పీకి ఫోన్ చేసి వివరాలు అడిగారు.












Click it and Unblock the Notifications