Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వైసీపీ-బీజేపీ ఒక్కటయ్యారనే ! ఎమ్మెల్సీ పోరులో ఓటమిపై విష్ణుకుమార్ రాజు కీలక వ్యాఖ్యలు..

ఏపీలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోరులో బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ ఓటమి ఆ పార్టీ నేతలకు షాక్ గా మారింది.

విశాఖపట్నం : ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గతంలో గెలిచిన సీటును సైతం బీజేపీ కోల్పోయింది. గతంలో టీడీపీ మద్దతుతో ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన పీవీఎన్ మాధవ్.. ఈసారి మాత్రం వైసీపీ, టీడీపీ పోరులో డిపాజిట్లు కూడా దక్కించుకోలేకపోయారు. దీనిపై ఆ పార్టీలో అంతర్మథనం మొదలైంది.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానంలో బీజేపీ (bjp) అభ్యర్ధి మాధవ్ ఘోర పరాజయంపై స్ధానిక మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు (vishnukumar raju) స్పందించారు. వైసీపీతో కుమ్మక్కయ్యారనే ప్రచారం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి ఓడిపోయినట్లు ఆయన వెల్లడించారు. ఈ ఓటమిపై పార్టీ అధిష్టానం అంతర్మథనం చేసుకోవాలని విష్ణు సూచించారు. రాష్ట్రంలో బీజేపీ-వైసీపీ ఒక్కటేనన్న అభిప్రాయం ఓటర్లలో బలంగా వెళ్లడం వల్లే బీజేపీ ఓడిపోయిందన్నారు. ఇదే అభిప్రాయం కొనసాగితే భవిష్యత్తులో మరింత నష్టం తప్పదన్నారు.

former bjp mla vishnukumar raju says mlc poll defeat with ysrcp nexus rumours, suggestion to party

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని విష్ణుకుమార్ రాజు విశ్లేషించారు. టీడీపీ-బీజేపీ-జనసేన పొత్తు ఏపీలో ప్రజాస్వామ్య పరిరక్షణకు అనివార్యమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని ప్రలోభాలు పెట్టిన ఫలితాలు ప్రతికూలంగా రావడం ప్రజల్లో వస్తున్న మార్పుకు నిదర్శమని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ అంశంపై జాతీయ, రాష్ట్ర నాయకత్వాలు ఇప్పటికైనా దృష్టిపెట్టాలని ఆయన కోరారు. ఏపీలో వైసీపీ, టీడీపీలకు సమాన దూరం అంటూ బీజేపీ నేతలు పదే పదే చెబుతున్న నేపథ్యంలో విష్ణు కామెంట్స్ ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

former bjp mla vishnukumar raju says mlc poll defeat with ysrcp nexus rumours, suggestion to party
More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+