Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kurupam: వార్ వన్ సైడే..జగన్‌కి చెల్లి అరుదైన గిఫ్ట్..!

కురుపాం:ఏదైనా సాధించగలిగే సమర్థురాలినైన నేను కావాలా.. లేక సమర్థత లేని అసమర్థులు కావాలా.. పంచ్ డైలాగ్‌తో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు కురుపాం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుష్పశ్రీవాణి. ఇక పుష్పశ్రీవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. 2014, 2019లో కురుపాం నియోజకవర్గం నుంచి వరుసగా రెండు సార్లు గెలిచి ఇక హ్యాట్రిక్ పై కన్నేశారు. ఈ సారి కూడా కురుపాంలో వైసీపీ జెండాను ఎగురేస్తామని చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు.

2019లో కురుపాం నుంచి గెలిచాకా.. సీఎం జగన్ తన కేబినెట్‌లో డిప్యూటీ సీఎం హోదాతో పుష్పశ్రీవాణిని తీసుకున్నారు. శ్రీవాణి తన చెల్లెలని కూడా పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. ఇక మొదటి నుంచి శత్రుచర్ల పరీక్షిత్ రాజు, పుష్పశ్రీవాణి దంపతులు జగన్‌కు విధేయులుగా ఉండి నడుచుకున్నారు. దీంతో వారికి ఆయన దగ్గర మంచి ప్రాధాన్యత గుర్తింపు దక్కింది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు అదే అభివృద్ధిని సంక్షేమం అజెండాతో ఓట్లు అడుగుతూ పుష్పశ్రీవాణి ముందుకు కదులుతున్నారు.

pushpa srivani campaign

ఇక పుష్పశ్రీవాణికి భర్త పరీక్షిత్ రాజు అండ ఉండనే ఉంది. ఇద్దరూ కలిసి కురుపాం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా నియోజకవర్గంలోని జియ్యమ్మవలస మండలం అల్లువాడ గ్రామంలో ఆ గ్రామదేవత ఆశీస్సులు తీసుకుని ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు పరీక్షిత్ రాజు దంపతులు. బైక్ ర్యాలీతో బయలుదేరి ప్రచారం చేశారు. వైసీపీ కార్యకర్తలు వారి అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో ప్రచారంలో జోష్ కనిపించింది. జగన్ సంక్షేమం, అభివృద్ధిలను ప్రజలకు వివరిస్తూ తమను ఆశీర్వదించాలని కోరారు.

ఇక పార్వతీపురం మన్యం జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్ రాజు డ్యాన్స్ వేస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచారు. నియోజకవర్గంలో ఇంజినీరింగ్ కాలేజీ, సరైన రహదారులు లేని మారుమూల ప్రాంతాల్లో రోడ్లు వేసి అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లామని చెప్పుకొచ్చారు.సీఎం జగన్ పాలనలో రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థలు రాష్ట్ర రూపురేఖలను మార్చాయని ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి చెప్పారు. మహిళలకు సీఎం జగన్ పెద్దపీట వేశారని పుష్పశ్రీవాణి గుర్తు చేశారు.

ఇక కురుపాం నియోజకవర్గంలో వార్ వన్‌సైడే ఉంటుందని అక్కడ కార్యకర్తలు అభిమానులు చెబుతున్నారు. కూటమి అభ్యర్థిగా టీడీపీకి చెందిన తోయక జగదీశ్వరి బరిలో నిల్చుంటున్నారు. అయితే తోయక జగదీశ్వరి పుష్పశ్రీవాణికి ఏమాత్రం పోటీ కాదని కార్యకర్తలు చెబుతున్నారు. ఈ మధ్యే ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించినందుకు ప్రభుత్వ ఉద్యోగి అయిన తోయక జగదీశ్వరి భర్త సన్యాసినాయుడును సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన విషయాన్ని గుర్తుచేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+