పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్..
Pinnelli Ramakrishna Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యారు. కొద్దిసేపటి కిందటే పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనున్నారు.
కిందటి నెల 13వ తేదీన పోలింగ్ సమయంలో మాచర్ల అసెంబ్లీ పరిధిలోని పాల్వాయిగేటు 202, 7 నంబర్ పోలింగ్ స్టేషన్లల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పిన్నెల్లి ధ్వంసం చేశారు. ఆయా పోలింగ్ కేంద్రాల్లో అమర్చిన వెబ్ కెమెరాల్లో ఇది స్పష్టంగా రికార్డయింది. ఆ విజువల్స్ సైతం వెలుగులోకి వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి అప్పట్లో.

పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దురుసుగా పోలింగ్ కేంద్రంలోనికి దూసుకుని రావడం, నేరుగా ఓ కంపార్ట్‌మెంట్ వద్దకు వెళ్లి ఈవీఎంను నేలకేసి కొట్టడం ఈ వీడియోల్లో కనిపించింది. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడినందు వల్లే సంబంధిత ఈవీఎంను పిన్నెల్లి ధ్వంసం చేశారనేది వైఎస్ఆర్సీపీ వాదన.
పిన్నెల్లి చర్యలను ఈసీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది. దీనిపై సమగ్ర నివేదిక కోరింది. ఈ మేరకు ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి రిపోర్టును ఈసీకి పింపించారు. ప్రధాన నిందితుడిగా పిన్నెల్లి పేరును చేర్చారు. వాటిని పరిశీలించిన అనంతరం ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ డీజీపీకి సిఫారసు చేయాలని ఈసీ ఆదేశించింది.
ఇదే కేసులో అరెస్టు నుంచి తనకు రక్షణ కావాలని కోరుతూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. ఆయన వేసిన నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను కూడా హైకోర్టు తోసిపుచ్చింది.
పోలీసుల తరఫున ఎన్ అశ్వినీకుమార్, ఫిర్యాదుదారు నంబూరి శేషగిరిరావు తరఫున న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు తమ వాదనలు వినిపించారు. ఈ నాలుగు పిటిషన్లపై గత గురువారం నాడు హైకోర్టులో విచారణ పూర్తయింది. దీనిపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఆ నాలుగు బెయిల్ పిటిషన్లన్నింటినీ కొట్టివేసింది. ఈ పిటీషన్లను హైకోర్టు కొట్టేసిన వెంటనే పిన్నెల్లిని పోలీసులు అరెస్ట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్‌ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications