వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఓటేయాలో చెప్పేసిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ..

ఏపీలో మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో వైసీపీ వర్సెస్ విపక్షాల పోరు తప్పేలా లేదు. ఇందులో వైసీపీకి వ్యతిరేకంగా బీజేపీ-జనసేన మాత్రమే పొత్తులో ఉంటాయా, లేక టీడీపీని కూడా చేర్చుకుంటాయా అన్న చర్చ జరుగుతోంది. నిన్న చంద్రబాబు వ్యాఖ్యలతో బీజేపీకి టీడీపీ దగ్గరయ్యేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు అర్ధమైంది. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో ఓటర్లు ఎవరికి ఓటేయాలన్న దానిపై మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హింట్ ఇచ్చారు.

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఇవాళ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన ప్రస్తుత రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పరిస్దితులపై పరోక్ష వ్యాఖ్యలు కూడా చేశారు. చివరిగా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వారిని ఎన్నుకోవాలన్న దానిపై వెంకయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇప్పుడు వెంకయ్య వ్యాఖ్యలపై చర్చ జరుగుతోంది. ఇంతకీ వెంకయ్య ఏం చెప్పారో ఓ సారి చూద్దాం.

venkaiahnaidu

ప్రస్తుత రోజుల్లో ప్రజలకు రాజకీయాల పట్ల ఆసక్తి తగ్గి పోతోందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. రాజకీయాల స్థాయి నానాటికి దిగజారుతుందన్నారు. రాజకీయాల స్థాయి పెంచాలంటే మంచివారినే ఎన్నుకోవాలని వెంకయ్య సూచించారు.రాజకీయాలలో బూతులు మాట్లాడే నాయకులను ప్రజలు ఎన్నికల బూతుల్లోనే ఓటు ద్వారా సమాధానం చెప్పాలన్నారు.
ప్రజా ప్రతినిధులను ధనాన్ని కులాన్ని చూసి ఎన్నుకోకుండా వ్యక్తిత్వాన్ని చూసి ఎన్నుకోవాలన్నారు. తాను రాజకీయాలకు పదవి విరమణ పొందానే కానీ, పెదవి విరమణ చేయలేదంటూ తన వ్యాఖ్యల్ని ఆయన సమర్ధించుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+