కృష్ణా జిల్లాలో టిడిపికి షాక్: మాకేం తెలియట్లేదని మనస్తాపం, నలుగురు రాజీనామా
విజయవాడ: కృష్ణా జిల్లా విజయవాడలో తెలుగుదేశం పార్టీకి షాక్ తగిలింది. జిల్లాలోని నూజివీడు మండలానికి చెందిన నలుగురు టిడిపి ఎంపీటీసీలు రాజీనామా చేశారు. కొంతకాలంగా నియోజకవర్గ ఇంఛార్జి వెంకటేశ్వర రావు, ఎంపీటీసీల మధ్య విభేదాలు కనిపిస్తున్నాయి.
గ్రామాలలో ఏ కార్యక్రమం చేపట్టినా ఎంపీటీసీలకు తెలియకపోవడం, అధికారులను ప్రశ్నిస్తే నియోజకవర్గ ఇంచార్జి ఏర్పాటు చేశారని చెప్పడంతో వారు మనస్తాపానికి గురయ్యారు.

దీంతో పల్లలమూడి ఎంపీటీసీ సంధ్యారాణి, ఎంఎన్ పాలెం ఎంపీటీసీ శాంతకుమారి, దిగవల్లి ఎంపీటీసీ నాగేంద్రప్రసాద్, రావిచర్ల ఎంపీటీసీ సాంబశివరావు మంగళవారంనూజివీడు ఎండీవో కార్యాలయానికి వెళ్లి తమ రాజీనామాలను ఎండీవో రాణికి అందించారు.
అయితే వాటిని ఆమె తిరస్కరించారు. ఇది తన పరిధిలోనిది కాదని జిల్లా పరిషత్ సీఈఓకు రాజీనామాలు ఇవ్వాలని సూచించారు. దీంతో బుధవారం నాడు మచిలీపట్నం వెళ్లి రాజీనామాలు సమర్పించేందుకు వారు సిద్ధమయ్యారు.












Click it and Unblock the Notifications