దొంగచాటుగా విభజించాలని: టి మీద సొంత పార్టీపై గాదె

ఎపి కాంగ్రెసు పార్టీ ఇంఛార్జి దిగ్విజయ్ సింగ్, కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండేలు తమ ప్రకటనలతో రాష్ట్ర ప్రజలను మరింత అయోమయానికి గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర విభజనకు సంబంధించి అసెంబ్లీకి తీర్మానం వస్తుందా?, డ్రాప్టు బిల్లు వస్తుందా? అనే విషయంపై కాంగ్రెస్ అధిష్ఠాన పెద్దలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారని, ఈ అంశంపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని కోరారు. విభజనపై కేంద్రం తీర్మానం పంపితే దానిపై ఓటింగ్ ఉంటుందని, డ్రాప్టు బిల్లు అయితే అభిప్రాయాలు మాత్రమే రికార్డు చేస్తారని తెలిపారు.
రాష్ట్ర విభజన కోసం తీర్మానం అసెంబ్లీకి రెండుసార్లు వస్తుందని దిగ్విజయ్ సింగ్ రెండుసార్లు చెప్పారన్నారు. అయితే తీర్మానం లేదని, బిల్లు ముసాయిదా మాత్రమే అసెంబ్లీకి వస్తుందని హోంమంత్రి షిండే చెప్పడంతో ప్రజలు అయోమయంలో పడ్డారన్నారు.












Click it and Unblock the Notifications