జగన్ సాక్షిపై గల్లా ఫైర్: కిరణ్‌కు షాక్ మీద షాక్

హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన సాక్షి మీడియాపై తెలుగుదేశం గుంటూరు లోకసభ అభ్యర్థి గల్లా జయదేవ్ తీవ్రంగా మండిపడ్డారు. తనపై వచ్చిన వార్తాకథనంపై ఆయన తీవ్రంగా స్పందించారు. తాను గుంటూరు అల్లుడినని, గుంటూరులోనే ఉంటానని ఆయన అన్నారు.

వర్షం కారణంగా తన సిబ్బంది గదుల్లోకి వెళ్తే తన పార్టీ కార్యాలయం ఖాళీ అయిందని సాక్షి మీడియా తప్పుడు ప్రచారం సాగించిందని ఆయన విమర్శించారు. వ్యతిరేక ఫలితాలు వస్తాయనే భయంతోనే తనపై సాక్షి మీడియా తప్పుడు ప్రచారానికి ఒడిగట్టిందని ఆయన అన్నారు. కాగా, సాక్షి దినపత్రిక ప్రతులను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దగ్ధం చేశారు.

Galla Jaydev fires at Sakshi: Another shock to Kiran

ఇదిలావుంటే, జై సమైక్యాంధ్ర పార్టీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డికి షాక్ మీద షాక్ తగులుతోంది. విశాఖపట్నం లోకసభ బరి నుంచి సబ్బం హరి వైదొలిగిన కొద్ది గంటల్లోని మరో ఇద్దరు శాసనసభ అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి జై సమైక్యాంధ్ర పార్టీ అసెంబ్లీ అభ్యర్థి భీమునిసెట్టి అదిబాబు పోటీ నుంచి తప్పుకున్నారు.

తన ఓట్లు చీలకూడదనే ఉద్దేశంతోనే బరి నుంచి తప్పుకున్నట్లు ఆయన తెలిపారు. ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు సమక్షంలో ఆదిబాబు తెలుగుదేశం పార్టీలో చేరారు. సబ్బం హరి విశాఖపట్నం లోకసభ స్థానంలో టిడిపితో పొత్తు పెట్టుకున్న బిజెపికి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.

ప్రకాశం జిల్లా కనిగిరి జై సమైక్యాంద్ర పార్టీ అభ్యర్థి కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. కనిగిరి అసెంబ్లీ అభ్యర్థి శేషాద్రి నాయుడు తాను ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన మంగళవారంనాడు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+