విశాఖపట్నం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీడీపీ ఆఫీసులో ప్రత్యక్షమైన గంటా శ్రీనివాసరావు: చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు; పార్టీ శ్రేణుల్లో చర్చ!!

|
Google Oneindia TeluguNews

టిడిపి సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పుడప్పుడు తెలుగుదేశం పార్టీలో నేనున్నాను అంటూ గుర్తు చేస్తున్నారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలైన తర్వాత యాక్టివ్ రాజకీయాలకు దూరంగా ఉంటున్న గంటా శ్రీనివాసరావు మళ్లీ ఇటీవల కాలంలో వైసీపీ పై మాటల తూటాలను పేలుస్తున్నారు. తాజాగా విశాఖ నార్త్ నియోజకవర్గంలో టిడిపి మహిళా కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పార్టీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేశారు. ఆయన టీడీపీని, చంద్రబాబును ఉద్దేశించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

మళ్ళీ యాక్టివ్ అవుతున్న గంటా శ్రీనివాసరావు .. టీడీపీ పార్టీ ఆఫీస్ లో ప్రత్యక్షం

మళ్ళీ యాక్టివ్ అవుతున్న గంటా శ్రీనివాసరావు .. టీడీపీ పార్టీ ఆఫీస్ లో ప్రత్యక్షం

గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా, ఇప్పుడిప్పుడే మళ్లీ రాజకీయంగా ముందుకు వస్తున్నారు. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో గంటా శ్రీనివాస్ యాక్టివ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. ఇక తాజాగా విశాఖ నార్త్ నియోజకవర్గంలో పార్టీ ఆఫీస్ లో జరిగిన కార్యక్రమంలో గంటా శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు అందుకు ఊతమిస్తున్నాయి. ఈ రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వం కావాలని, ఏపీ బాగుండాలంటే మళ్లీ చంద్రబాబు సీఎం కావాలని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు స్థాయినుంచి బూత్ లెవెల్ వరకు పటిష్టంగా ఉందని మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు.

బాదుడే బాదుడుకు మంచి రెస్పాన్స్ .. ప్రభుత్వంపై వ్యతిరేఖత కనిపిస్తుందని వెల్లడి

బాదుడే బాదుడుకు మంచి రెస్పాన్స్ .. ప్రభుత్వంపై వ్యతిరేఖత కనిపిస్తుందని వెల్లడి


వాలంటీర్ల వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా బలమైన క్లస్టర్ వ్యవస్థను ఏర్పాటు చేశామని ఆయన వెల్లడించారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్వహిస్తున్న బాదుడే బాదుడు కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని తెలిపిన ఆయన వైసీపీ నేతలు చేపట్టిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజా నిరసన అడుగడుగునా కనిపిస్తోందని వెల్లడించారు. ఇక దీనిని తెలుగుదేశం పార్టీ నేతలు వాడుకోవాలని, వచ్చే ఎన్నికల్లో విజయం సాధించే దిశగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నూతనంగా ఏర్పాటు చేసిన క్లస్టర్ వ్యవస్థను గెలుపు దిశగా తీసుకు వెళ్లాల్సిన అవసరం ఉందని గంటా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

గంటా రాజకీయాల్లో యాక్టివ్ కావటంపై చర్చ

గంటా రాజకీయాల్లో యాక్టివ్ కావటంపై చర్చ

గత కొంత కాలంగా పార్టీలో ఉంటూ పార్టీ కోసం పని చేయని గంటా శ్రీనివాసరావు, తాజాగా మళ్లీ పార్టీ కోసం నేనున్నాను అంటూ ముందుకు రావడం మళ్ళీ వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కోసమేనన్న చర్చ పార్టీ నేతల్లో జరుగుతుంది. చంద్రబాబు పార్టీ కోసం పని చేసిన వారికి, కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న వారికి మాత్రమే వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తామని చేసిన ప్రకటన నేపథ్యంలో గంటా శ్రీనివాసరావు ఇప్పుడు ఇప్పుడు యాక్టివ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది.

ఇటీవల చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉన్నగంటా .. కానీ ఇప్పుడు ఆసక్తికర రాజకీయం

ఇటీవల చంద్రబాబు పర్యటనకు దూరంగా ఉన్నగంటా .. కానీ ఇప్పుడు ఆసక్తికర రాజకీయం

గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో గానీ, బిజెపిలో కానీ చేరుతారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది. కానీ గంటా శ్రీనివాసరావు ఆ ప్రచారాన్ని సైతం కాదు అని తిప్పి కొట్టలేదు. ఇక పార్టీ కార్యక్రమాలలో పాల్గొన్న దాఖలాలు కూడా లేవు. ఇటీవల అధినేత చంద్రబాబు విశాఖ పర్యటనకు వెళ్ళిన సమయంలో గంటా శ్రీనివాసరావు చంద్రబాబు పర్యటనకు కూడా దూరంగా ఉన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశానికి కూడా ఆయన హాజరు కాలేదు. ఇక మళ్లీ చాలా రోజుల తర్వాత గంటా శ్రీనివాసరావు పార్టీ ఆఫీస్ కు వెళ్లి, తన గళాన్ని తెలుగుదేశం పార్టీ కోసం వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

English summary
TDP leaders are debating whether Ganta is active again with the remarks made by former minister Ganta Srinivasa Rao that Chandrababu should be the CM again if AP is to improve.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X