అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

'గంటా' వాడకం మాములుగా ఉండదు... ఈసారి ఆయన వంతు?

|
Google Oneindia TeluguNews

గంటా శ్రీనివాసరావు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రాజకీయవేత్త గురించి తెలియనివారుండరు. వాస్తవానికి ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందరు. అధికారానికి మాత్రమే చెందుతారు. అధికారం ఏ పార్టీవైపు ఉంటే ఆయన కూడా ఆ పార్టీలోనే ఉంటారు. తెలుగుదేశం నుంచి ప్రజారాజ్యం, ప్రజారాజ్యం నుంచి కాంగ్రెస్, కాంగ్రెస్ నుంచి మళ్లీ తెలుగుదేశం, ఇప్పుడు తెలుగుదేశం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ అంటూ వార్తలు వస్తున్నాయి.

 పార్టీ మారితే చెప్పే మారతానంటున్నారే..

పార్టీ మారితే చెప్పే మారతానంటున్నారే..

అయితే ఆయన తాజాగా ఒక స్పష్టత ఇచ్చారు. పార్టీ మారితే మీకు చెప్పే మారతాను అన్నారు. ఎందుకు చెప్పారంటే చాలారోజుల తర్వాత మీడియా సాక్షిగా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. డిసెంబరు 26 వంగవీటి రంగా వర్థంతిని పురస్కరించుకొని రాధా-రంగా రాయల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆరోజు కాపునాడు జరగబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ ను ఆయన ఆవిష్కరిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాపుల అభివృద్ధి కోసం ఏ కార్యక్రమం పెట్టినా తాను ముందుంటానన్నారు. దీంతో రాజకీయ విశ్లేషకులంతా గంటా శ్రీనివాసరావు ఈసారి రంగాను వాడుతున్నాడంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు.

నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా పర్యటించలేదు..

నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా పర్యటించలేదు..


మూడున్నర సంవత్సరాలుగా ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా ఆయన పర్యటించలేదు. ఆయనకు సంబంధించిన మనుషులే ఏమైనా పనులుంటే కార్యాలయంలో చక్కబెట్టేస్తున్నారు. వైఎస్ జగన్ దూకుడుగా వ్యవహరిస్తుండటంతో సెలెంటయ్యారేమో అనుకున్నారు. అనుకోకుండా ఒకరోజు రాజీనామా చేస్తున్నానంటూ స్పీకర్ కార్యాలయానికి స్పీకర్ ఫార్మాట్ లో రిజైన్ చేసిన లేఖను పంపించారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తున్నానని, అందుకే ఈ రాజీనామా అన్నారు.

 విశాఖ ఉక్కు బదులు వంగవీటి రంగా..

విశాఖ ఉక్కు బదులు వంగవీటి రంగా..


గంటా శ్రీనివాసరావు రాజకీయాలను మొదటి నుంచి పరిశీలించేవారికి ఒక విషయం మాత్రం స్పష్టమైంది. విశాఖ ఉక్కును ఈసారి గంటా వినియోగించుకోబోతున్నారు అని. ఇంతలో అకస్మాత్తుగా రంగా-రాధా రాయల్ ఆర్గనైజేషన్ వచ్చి చేరింది. విశాఖ ఉక్కు వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదనే అంచనా ఉండటంతో ఈసారికి వంగవీటి రంగాను వినియోగించుకోబోతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పోస్టర్ ఆవిష్కరించేటప్పుడు ఆయన చేసిన నర్మగర్భ వ్యాఖ్యలు కూడా ఒకసారి పరిశీలిద్దాం. తాను ఏ కార్యక్రమం చేసినా అనివార్యంగా రాజకీయాలతో ముడిపడివుంటుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో కాపుల ఓట్లే కీలకం కాబోతున్నాయి. కాపు నేతలకు కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. డిసైడింగ్ ఫ్యాక్టర్ గా కాపులు మారబోతుండటంతోనే అటువైపుగా తన రాజకీయాన్ని గంటా తిప్పారనడంలో అతిశయోక్తి లేదు.

English summary
ganta srinivasarao present political situation in aandhra pradesh
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X