స్త్రీ గొంతు కోశారు, పిడుగుపాటుకు దంపతుల మృతి
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని ఫరూఖ్‌నగర్ మండలం రంగంపల్లిలో దారుణం జరిగింది. శనివారం తెల్లవారుజాము కొందరు గుర్తు తెలియని దుండగులు మమత అనే మహిళ గొంతు కోసి పరారయ్యారు. తీవ్రంగా గాయపడిన మమతను షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలు షాబాద్ మండలం నాగర్‌గూడ వాసి. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కేసు నమోదు చేశారు.
రంగారెడ్డి జిల్లా షాబాగ్ మండలం నాగరగూడుకు చెందిన మమత (20)కు అదే జిల్లాకు చెందిన కంకల్ గ్రామానికి చెందిన మల్లేష్‌తో ఏడాది క్రితం వివాహమైంది. కుటుంబ కలహాలతో ఏడు నెలలుగా వారు విడిగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఆమెపై దాడి జరగడం అనుమానాలకు తావిస్తోంది.

శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాం గ్రామానికి చెందిన కీలు నారాయణ (55), లక్ష్మి (42) అనే దంపతులు పిడుగుపాటుకు గురై మరణించారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా పంచాయతీకి చెందిన కొబ్బరి మొక్కలకు నీరు పెడుతుండగా ఆ విషాద సంఘటన చోటు చేసుకుంది.
ఇదిలావుంటే, తూర్పు గోదావరి జిల్లాలోని రంగంపేట ఏడీపీ రోడ్డులో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు- లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో లారీ క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను పోలీసులు రక్షించారు. డ్రైవర్‌తో సహా గాయపడిన వారిని రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


Click it and Unblock the Notifications