గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్‌బుక్ స్నేహం: ఫ్రెండ్‌తో వెళ్తూ స్వాతి మృతి, ట్విస్ట్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Girl dies while going on bike
గుంటూరు: ఫేస్‌బుక్‌లో నాలుగు రోజుల క్రితం పరిచయమైన యువతీయువకుల మధ్య స్నేహం చిగురించే దశలోనే చెదిరిపోయింది. ఊహించనిరీతిలో యువతి రోడ్డు ప్రమాదంలో మరణించింది. స్నేహితుడు నిందితుడిగా మారాడు. ఈ విషాద సంఘటన గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది.

చిలకలూరిపేటకు చెందిన స్వాతి. ఆమె నూజివీడు ట్రిపుల్ ఐటిలో చదువుతోంది. ఇటీవలె రెండో సెమిస్టర్ పరీక్షలు పూర్తయ్యాయి. సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. గుంటూరుకు చెందిన సూరజ్ సింగ్‌తో ఈ నెల 11న ఫేస్‌బుక్ ద్వారా స్వాతికి పరిచయం ఏర్పడింది. వీరు స్నేహితులయ్యారు. 12వ తేదీన చాటింగులో ఫోన్ నెంబర్లు అడిగి తెలుసుకున్నారు.

స్వాతి నూజివీడు ట్రిపుల్ ఐటిలో ద్వితీయ సంవత్సరంలో చేరేందుకు తల్లితో కలిసి గుంటూరుకు వచ్చింది. అక్కడి నుండి స్నేహితులతో కలిసి వెళ్తానని చెప్పడంతో తల్లి వెళ్లిపోయింది. ఆ తర్వాత స్వాతి సూరజ్ సింగ్‌ను కలుసుకుంది. ఇద్దరు కలిసి రాత్రి ఏడు గంటల వరకు మాట్లాడుతున్నారు.

ఆ తర్వాత తాను నూజివీడు వెళ్లాలని స్వాతి అతనికి చెప్పింది. మోటార్ బైక్ పైన వదిలి పెడతానని గుంటూరు నుండి ఆమెను తీసుకొని బయలుదేరాడు. నూజివీడు ట్రిపుల్ ఐటికి చేరుకునే సరికి రాత్రి పన్నెండున్నర అయింది. ఆ సమయంలో హాస్టలు లోపలకు అనుమతించక పోవడంతో వీరు తిరిగి గుంటూరుకు పయనమయ్యారు.

మంగళగిరి చినకాకాని వద్దకు వచ్చేసరికి రాత్రి రెండున్నర గంటలు అయింది. ఆ సమయంలో స్వాతి చున్నీ మోటారు సైకిల్ వెనుక చక్రంలో ఇరుక్కుపోయింది. దీంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. స్వాతి తలకు బలంగా గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మృతిలో కొత్త మలుపు

స్వాతి మృతి పైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వాతి కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాత్రివేళ స్వాతిని తీసుకెళ్లి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. స్వాతికి కొన్నాళ్లుగా సూరజ్‌తో పరిచయం ఉన్నట్లుగా కనిపిస్తోందని బంధువులు అనుమానిస్తున్నారు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తుండవచ్చునని అనుమానిస్తున్నారు. సూరజ్ చెప్పినదాంట్లో నిజమేంతో తేలాలన్నారు.

English summary
Gunturl girl student dies while going on bike.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X