అదే ముఖ్యం: ఎమ్మెల్యే గోరంట్ల ఉద్వేగం, ‘బాబుకు మంచి బుద్ధి రావాలి’
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై మరోసారి తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ఆవేదనను వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బ
రాజమండ్రి/కడప: ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణలో తనకు మంత్రి పదవి దక్కకపోవడంపై మరోసారి తెలుగుదేశం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన ఆవేదనను వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉద్వేగానికి లోనయ్యారు.
పదవులు ముఖ్యం కాదు... అభివృద్ధే ముఖ్యమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి చెప్పారు.
తనను ఎవరూ బుజ్జగించాలని కోరుకోవడం లేదని, పార్టీకి నష్టం జరగకూడదన్న ఉద్దేశంతోనే పార్టీ పదవికి రాజీనామా చేయాల్సి వచ్చిందని బుచ్చయ్య చౌదరి వివరణ ఇచ్చారు.

చంద్రబాబుకు మంచి బుద్ధి రావాలి
ముస్లిం మైనార్టీలకు మంత్రి మండలిలో స్థానం కల్పించని చంద్రబాబుకు మంచిబుద్ధి ప్రసాదించాలని కడప మైనార్టీ నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి వినూత్న రీతిలో వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అన్ని వర్గాల ప్రజలకు సమాన న్యాయం చేస్తానని చెప్పిన సీఎం చంద్రబాబు.. ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేశారన్నారు. ఇలాంటి వ్యక్తికి మంచి బుద్ధి ప్రసాదించాలని ఎన్టీఆర్ విగ్రహాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఖాదర్‌బాష, తాహిర్, అష్రఫ్ అలీఖాన్, అబ్దుల్లా, గోరుగోల్డ్, జాకీర్ పాల్గొన్నారు












Click it and Unblock the Notifications