పాత ఏసీ తీసుకుని కొత్త ఏసీ ఇస్తున్న ప్రభుత్వ పథకం.. పూర్తిగా చదవండి!
సమాజంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా ఎక్కడ చూసినా సోషల్ మీడియా వాడకం ఎక్కువైంది. ఇక సోషల్ మీడియా వాడకం ఎక్కువైన కొద్దీ ఏది నిజమో, ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రభుత్వ పథకాల పేరుతో రకరకాల ప్రచారాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి.
పాత ఏసీలు తీసుకుని కొత్త ఏసీలు ఇస్తారని ప్రచారం
ప్రస్తుతం సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వ పీఎం ఏసీ యోజన స్కీమ్ పేరుతో ఒక ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పథకంలో పాత ఏసీలను తీసుకుని కొత్త ఏసీలను ఉచితంగా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇక గ్రామాలలో దీనిపైన జోరుగా చర్చ జరుగుతుంది. మరి ఇందులో నిజానిజాలు ఏమిటి? అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం
కేంద్ర ప్రభుత్వం పి ఎం ఏసీ యోజన 2025 స్కీంను ప్రవేశపెట్టిందని, ఈ స్కీమ్ కింద అందరికీ పాత ఏసీలను తీసుకుని కొత్త ఏసీ లను ఉచితంగా ఇస్తుందని మొత్తం దేశవ్యాప్తంగా ఐదు కోట్ల మందికి ఫైవ్ స్టార్ ఎయిర్ కండిషనర్ లను ఉచితంగా ఇచ్చేందుకు సిద్ధమైందని ప్రచారం జరుగుతోంది.
ఏసీల కోసం గ్రామాల్లో ఎంక్వయిరీ
సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్న ఈ పోస్టును చూసి చాలామంది నిజమని నమ్మి దీనిని ఎక్కడ ఇస్తారు? ఎప్పటి నుంచి ఇస్తారు? దీనికోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలి? దీనిని ఎవరు ఇస్తారు? వంటి ఎంక్వయిరీలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పథకాన్ని 2025 మే నెల నుంచి ప్రారంభిస్తుందని కూడా పెద్దఎత్తున ప్రచారం జరిగింది. దీనికోసం ఇంధన మంత్రిత్వ శాఖ 1.5కోట్ల ఏసీలను ఇప్పటికే ఆర్డర్ ఇచ్చినట్లుగా ప్రచారం జరిగింది.
నిజానిజాల నిగ్గు తేల్చిన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో
దీనికోసం వీలైనంత త్వరగా దరఖాస్తు ఫారం నింపి అప్లికేషన్ పెట్టుకోవాలని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ కాగా ప్రజలంతా దీని కోసం పెద్ద ఎత్తున ఎంక్వయిరీ మొదలుపెట్టారు.
చివరికి దీనిపైన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఈ పోస్టులోని నిజా నిజాల పైన ఎంక్వయిరీ చేసింది. ప్రభుత్వం అటువంటి పథకాన్ని ప్రవేశపెట్టలేదని తెలిసింది. అది పూర్తిగా అబద్ధమని ఏ ప్రభుత్వ శాఖ కానీ ఇంధన మంత్రిత్వ శాఖ గాని అటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం చెయ్యలేదని పేర్కొంది.
సోషల్ మీడియాలో వచ్చిన ఈ పోస్ట్ తప్పు
అలాంటి ఫారం ని పూర్తి చేయాలని చెప్పడం కానీ చేయలేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే ఇటువంటి పోస్టులను పట్టించుకోవద్దని తేల్చి చెప్పింది. ప్రజలు ఇటువంటి పోస్టుల పైన అప్రమత్తంగా ఉండాలని సూచించింది.












Click it and Unblock the Notifications