ఏపీలో పెరిగిన వసూళ్లు..!!
GST February 2024 collections: జాతీయ స్థాయిలో వస్తు, సేవా పన్నుల వసూళ్లు భారీగా పెరిగాయి. ఫిబ్రవరిలో మరోసారి రికార్డు స్థాయిలో జీఎస్టీ రెవెన్యూ నమోదైంది. గత సంవత్సరం ఇదే నెలతో పోల్చుకుంటే 12.5 శాతం మేర పెరుగుదల కనిపించింది. కేంద్ర ప్రభుత్వ అంచనాలకు అనుగుణంగా జీఎస్టీ వసూళ్లు నమోదయ్యాయి. ఏపీలో జీఎస్టీ కలెక్షన్లు మరోసారి జోరందుకున్నాయి.
ఫిబ్రవరిలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన జీఎస్టీ వసూళ్లు- 1,68,337 కోట్ల రూపాయలు. 2023 ఇదే ఫిబ్రవరితో పోల్చుకుంటే ఈ సంఖ్య 12.5 శాతం అధికం. ఇందులో సీజీఎస్టీ వాటా 31,785 కోట్ల రూపాయలు.

ఎస్‌జీఎస్టీ- 39,615 కోట్ల రూపాయలు, ఐజీఎస్టీ- 84,098 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. దిగుమతి చేసుకున్న వస్తువులపై విధించిన జీఎస్టీ వల్ల వచ్చిన ఆదాయం 41,145 కోట్ల రూపాయలను ఇందులోనే విలీనం చేశారు. ఇక సెస్ రూపంలో అందిన మొత్తం 12,839 కోట్ల రూపాయలు. దిగుమతి చేసుకున్న వస్తువులపై వసూలు చేస్తోన్న సెస్ వల్ల 881 కోట్ల రూపాయల మొత్తాన్ని కూడా ఇందులోనే కలిపారు.
ఏపీలో జీఎస్టీ వసూళ్లు మరోసారి పెరిగాయి. ఈ పెరుగుదల మూడు శాతంగా నమోదైంది. గత ఏడాది ఫిబ్రవరిలో ఏపీలో నమోదైన జీఎస్టీ వసూళ్లు 3,553 కోట్ల రూపాయలు.. కాగా ఇప్పుడు ఈ సంఖ్య 3,678 కోట్ల రూపాయలుగా నమోదైంది. తెలంగాణతో పోల్చుకుంటే ఇది తక్కువే. తెలంగాణలో పెరిగిన జీఎస్టీ వసూళ్లు 18 శాతంగా నమోదైంది.
రాష్ట్రాలవారీగా చూసుకుంటే.. జమ్మూకాశ్మీర్-రూ.532 కోట్లు, హిమాచల్ ప్రదేశ్-రూ.746 కోట్లు, పంజాబ్-రూ.1,955 కోట్లు, చండీగఢ్-రూ.211 కోట్లు, ఉత్తరాఖండ్-రూ.1,525 కోట్లు, హర్యానా-రూ.8,269 కోట్ల రూపాయల వసూళ్లను సాధించాయి. ఢిల్లీ-5,544 కోట్లు, రాజస్థాన్-3,941 కోట్లుగా నమోదయ్యాయి.
ఉత్తర ప్రదేశ్-రూ.8,054 కోట్లు, బిహార్-రూ.1,491 కోట్లు, సిక్కిం-రూ.299 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్-రూ.101 కోట్లు, నాగాలాండ్-రూ.51 కోట్ల రూపాయలుగా నమోదయ్యాయి. మణిపూర్-రూ.56 కోట్లు, మిజోరం-రూ.49 కోట్లు, త్రిపుర-రూ.85 కోట్లు, మేఘాలయ-రూ.193 కోట్ల రూపాయల మేర జీఎస్టీ వసూళ్లను అందుకున్నాయి.
అస్సాం-రూ.1,390 కోట్లు, పశ్చిమబెంగాల్-రూ.5,357 కోట్లు, జార్ఖండ్-రూ.2,933 కోట్లు, ఒడిశా-5,136 కోట్లుగా రికార్డయ్యాయి. ఛత్తీస్‌గఢ్- 3,124, మధ్యప్రదేశ్-రూ.3,572 కోట్లు, డయ్యూ డామన్/దాద్రానగర్ హవేలి-రూ.355 కోట్లు, గుజరాత్-11,029 కోట్లు రికార్డయ్యాయి.
మహారాష్ట్ర-రూ.27,065 కోట్లు, కర్ణాటక-రూ.12,815 కోట్లు, గోవా-రూ.581 కోట్లు, కేరళ-రూ.2,688 కోట్లు, తెలంగాణ- రూ.5,211 కోట్లు, తమిళనాడు-రూ.9,713 కోట్లు, పుదుచ్చేరి-రూ.231 కోట్లు, అండమాన్ నికోబార్-రూ.39 కోట్ల రూపాయల మేర జీఎస్టీ కలెక్షన్లు నమోదైనట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది.












Click it and Unblock the Notifications