బోగి మంటల్లో ప్రతులు: ప్రతీకారచర్యలని టి నేతల వార్న్

వచ్చే ఎన్నికలలో తాను ఎంపీగానే పోటీ చేస్తానని చెప్పారు. జిల్లా కాంగ్రెసు నేతలు, కార్యకర్తలు తాను ఎంపీగానే పోటీ చేయాలని కోరుకుంటున్నారన్నారు. అధిష్టానం దూతలకు సైతం ఇదే విషయాన్ని కాంగ్రెసు పార్టీ నియోజకవర్గ శ్రేణులు చెప్పినట్లుగా తనకు సమాచారం ఉందన్నారు.
సీమాంధ్రలో తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతుల దగ్ధం చేయడంపై టిఎన్జీవో నేత శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సోమవారం ఉదయం మీడియాతో మాట్లాడుతూ భోగి మంటల్లో బిల్లు ప్రతులను తగులబెట్టడం కాదు ముందు మీ అజ్ఞానాన్ని, అహంకారాన్ని తగులబెట్టుకోవాలని హితవు పలికారు.
తెలంగాణ ప్రజల ఆగ్రహానికి ఆహుతి కాక తప్పదని హెచ్చరించారు. బిల్లు ప్రతులను తగులబెట్టిన నేతలపై దేశ ద్రోహం కేసు పెట్టాలని, తెలంగాణను అడ్డుకునే నేతలపై ప్రతీకార చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ముసాయిదా బిల్లులను తగుల బెట్టడం అజ్ఞానం అన్నారు. డ్రాఫ్ట్ బిల్లులు తగులబెట్టడం సరికాదని టిటిడిపి నేత ఎర్రబెల్లి దయాకర రావు అన్నారు.
కాగా, సీమాంధ్ర ప్రాంతంలోని పలుచోట్ల తెలంగాణ ముసాయిదా బిల్లు ప్రతులను దగ్ధం చేశారు. ప్రతులను దగ్ధం చేయడంపై తెలంగాణ ప్రాంత నాయకులు మండిపడ్డారు.












Click it and Unblock the Notifications