వారిని ఉరి తీయాలి, ఆ కలెక్టర్ ఓ ఫూల్: మోహన్ బాబు ఆగ్రహం
ఉద్యోగ విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే అలాంటి వారికి ఉరిశిక్ష విధించాలని ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు సోమవారం అన్నారు. ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
చిత్తూరు: ఉద్యోగ విధుల్లో నిర్లక్ష్యంగా వహిస్తే అలాంటి వారికి ఉరిశిక్ష విధించాలని ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మోహన్ బాబు సోమవారం అన్నారు. ఏర్పేడు ప్రమాద బాధిత కుటుంబాలని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తాను ఎవరినీ విమర్శించడానికి ఇక్కడకు రాలేదని, కేవలం పరామర్శకు మాత్రమే వచ్చానని చెప్పారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు.

నిజానిజాలు బయటకు రావాలి
ఏర్పేడు ప్రమాద ప్రమాదం వెనుక నిజానిజాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే అలాంటి వారికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా గతంలో ఉన్న ఓ కలెక్టర్ గురించి మాట్లాడారు.

ఆ కలెక్టర్ ఓ ఫూల్
అప్పట్లో ఓ కలెక్టర్ ఉండేవారని, అతను ఓ ఫూల్ అని మండిపడ్డారు. ఇసుక మాఫియాపై, అలాగే మోదుగులపాలెం బ్రిడ్జి కోసం తాను ఎన్నిసార్లు లేఖలు రాసినా స్పందించలేదని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.

ఆత్మగౌరవంతో బతుకుతారు..
సిపిఐ నేత నారాయణ కూడా ఏర్పేడు ప్రమాద బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడారు. మునగలపాలెం గ్రామస్తులు ఆత్మగౌరవంతో బతుకుతారని చెప్పారు. ప్రజలు పోలీస్ స్టేషన్‌కు వస్తే పట్టించుకోకపోవడం దారుణం అన్నారు. ఎస్పీపై హత్యా నేరం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

వనజాక్షి విషయంలో..
గతంలో వనజాక్షి విషయంలో చంద్రబాబు దూషించారని, అందుకే ఇసుక మాఫియా రెచ్చిపోతోందని నారాయణ మండిపడ్డారు. ఏర్పేడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. ఇసుక మాఫియా రెచ్చిపోతోందని, చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications